Advertisementt

కమల్ -గౌతమి బ్రేకప్ పై రమ్య హస్తమా..!!

Wed 09th Nov 2016 07:59 PM
kamal haasan,gouthami,ramya krishna,break up to kamal-gouthami  కమల్ -గౌతమి బ్రేకప్ పై రమ్య హస్తమా..!!
కమల్ -గౌతమి బ్రేకప్ పై రమ్య హస్తమా..!!
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ - గౌతమి సహజీవనానికి గౌతమి శుభం కార్డు వేసింది. చాలా కాలం కలిసున్న వీరిద్దరూ ఒక్కసారిగా విడిపోయారు. కారణం మాత్రం సరిగ్గా చెప్పకుండా మేం విడిపోతున్నాం అని.... ఇలా విడిపోవడం చాల బాధాకరమైన  విషయమని మాత్రమే చెప్పింది. అయితే కమల్ తో  గౌతమి విడిపోవడం వెనుక చాల కారణాలున్నాయని మీడియా లో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒక విధంగా గౌతమి, కమల్ నుండి విడిపోవడానికి శృతిహాసన్ కారణమని అన్నారు. మరో రకంగా గౌతమి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్లనే కమల్ తో విడిపోయి తన కూతురుతో గౌతమి ఉంటుందని అన్నారు. 

అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కారణంగానే కమల్ కి గౌతమ్ కి బ్రేకప్ ఆయ్యిందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త. అదేమిటి రమ్యకృష్ణ గౌతమి - కమల్ విడిపోవడానికి కారణమెలా అయ్యింది అని అనుకుంటున్నారా... దానికి కారణం కూడా శభాష్ నాయుడేనట.

శభాష్ నాయుడు సినిమాలో  కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమికి, రమ్యకృష్ణ కి కూడా గొడవ జరిగిందట. శభాష్ నాయుడు సినిమాకి గౌతమి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కాస్ట్యూమ్స్ విషయంలో కమల్ కూతురు శృతికి గౌతమికి గొడవలు జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు రమ్యతో  కూడా గౌతమి గొడవపడిందని అంటున్నారు. అయితే ఈ గొడవలో కమల్ రమ్యకు సపోర్ట్ చేసి గౌతమిని మందలించినట్లు వార్తలొస్తున్నాయి. 

ఇక ఇప్పటికే శృతితో గొడవ.... అక్కడ కూడా కమల్ సపోర్ట్ శృతికి ఉండడం... ఇప్పుడు ఇక్కడ గొడవలో కమల్ సపోర్ట్ రమ్యకు ఇవ్వడం తో మనసువిరిగిపోయి కమల్ తో ఇక ఉండడం ఇష్టం లేక గౌతమి తన 13 ఏళ్ళ సహజీవనానికి చెక్ పెట్టిందని ఇప్పుడు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ