Advertisementt

శర్వానంద్ ప్రేమలో పడ్డాడా..!

Thu 10th Nov 2016 11:20 AM
sharwanand,ramcharan,upasana,sharwanand love marrage  శర్వానంద్ ప్రేమలో పడ్డాడా..!
శర్వానంద్ ప్రేమలో పడ్డాడా..!
Advertisement
Ads by CJ

సినిమా పరిశ్రమలో ప్రేమ- పెళ్లిళ్ళు అన్నవి చాలా సాధారణమైపోయిన కాలమిది. అలాగే జరిగిన చాలా వాటిని మనం చూశాం కాబట్టి ఇవి మనకు చాలా సహజమైపోతున్నాయి. ఈ మధ్యనే నాగ్ తో సమంత ఎఫైర్ కూడా, చివరకు పెళ్ళిపీఠలెక్కబోతుంది. అయితే తాజాగా టాలీవుడ్‌లో మ‌రో హీరో  కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విపరీతంగా రూమర్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ ప్రేమలో ఉన్నాడని పరిశ్రమలో బాగా టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళ్తే.. హీరో శర్వానంద్, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న క‌జిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడ‌న్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

కాగా రామ‌చర‌ణ్‌...శ‌ర్వానంద్ మంచి మిత్రులు. అలా ఉపాస‌న క‌జిన్, శ‌ర్వాకి మంచి దోస్త్‌ అయినట్లుగా వినికిడి. వీళ్లంతా కలిసి మెలిసి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఈ విషయంలో శర్వానంద్ కి, ఇక రామ్ చరణ్ మద్దతు కూడా గట్టిగా  ఉండటంతో గట్టిగానే ఆ దిశగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ తోడల్లుళ్ళు అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నట్లు తెలుస్తుంది. ఇంకాస్త అడ్వాన్స్ గా కూడా వచ్చేసి రాబోవు ఏడాదిలో వీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ పుకార్లే అంటూ శర్వానంద్ సన్నిహుతులు చెప్పినా, నిప్పులేనిదే పొగరాదుగా అంటున్నారు సినీ సర్కిల్ లో జనాలు. కాగా  సోషల్ నెట్ వర్క్ లో వస్తున్న వార్తలకు ఈ మధ్య శర్వానంద్ కాస్త అప్ సెట్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నా వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్నది మాత్రం నిజమనే అనిపిస్తుందని అంటున్నారు సినీజనం. కాగా ప్రస్తుతం శర్వానంద్ అయ్యప్ప దీక్షలో ఉండటంతో వీటన్నింటిపై పూర్తి క్లారిటీ దీక్ష అయిన తర్వాత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ