Advertisementt

మెగా అభిమానులు ఏం చేస్తారు?

Thu 10th Nov 2016 12:59 PM
gautamiputra satakarni movie,khaidi number 150 movie,sankranthi 2017 releases,mega fans  మెగా అభిమానులు ఏం చేస్తారు?
మెగా అభిమానులు ఏం చేస్తారు?
Advertisement
Ads by CJ

సంక్రాంతి బరిలో దిగుతున్న ఇద్దరు టాప్ హీరోలు  మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ  సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఒకరిది సామాజిక కోణం ఉన్న 'ఖైదీ నంబర్ 150'. మరొకరిది చారిత్మక నేపథ్యం ఉన్న  'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ రెండు కమర్షియల్ ఫార్మేట్ లో తీస్తున్నవే. ఇకపోతే 'శాతకర్ణి' ప్రచార హడావుడి ఇప్పటికే మెుదలైంది. సినిమాలోని ప్రధాన పాత్రధారుల లుక్స్ విడుదల చేశారు. బుధవారం నాడు బాలయ్య అభిమానులు ఆర్భాటంగా 'శాతకర్ణి' ప్రచారం మెుదలెట్టారు. భారతదేశంలోని వంద పుణ్యక్షేత్రాలను సందర్శించి కుంకుమ సేకరిస్తారు. ఆ తర్వాత హోమం నిర్వహిస్తారు. బాలకృష్ణ వందవ సినిమా కావడం వల్ల సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి అభిమానులు తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు.

 ఇక 'ఖైదీ నంబర్ 150' చిత్రం చిరంజీవికి కీలకం. సంఖ్యాపరంగా ఆయనకు 150వ సినిమా. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం ప్రచార పర్వం ఇంకా మెుదలుకాలేదు. లుక్స్ కూడా కేవలం చిరంజీవివే విడుదల చేశారు. చిత్రీకరణలో ఉన్న ప్రత్యేకతలు సైతం మీడియాకు చెప్పడం లేదు. ఇక మెగా అభిమానులు ఏం చేస్తారనేది స్పష్టం కాలేదు. 'ఖైదీ'కి హైప్ క్రియేట్ చేయడానికి వారు ఏ మేరకు హడావుడి చేస్తారనే దానిపై స్పష్టత లేదు. చిరు కెరీర్ లో 150వ సినిమా అంటే మైలురాయి లాంటిదే. అయితే ఎలాంటి హడావుడి చేయకుండానే 'ఖైదీ..'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారనే మాట కూడా వినిపిస్తోంది. సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టాలని, హైప్ క్రియేట్ చేస్తే అంచనాలు పెరుగుతాయనే సందేహం సైతం యూనిట్ లో ఉందని భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ