Advertisementt

ప్రభుదేవాకు పిలుపు లేదు..!!

Fri 11th Nov 2016 11:13 AM
prabhu deva,chiranjeevi,khaidi no 150 movie,raghava lawrence,  ప్రభుదేవాకు పిలుపు లేదు..!!
ప్రభుదేవాకు పిలుపు లేదు..!!
Advertisement
Ads by CJ

డాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవాకు చివరి పిలుపు సైతం అందలేదు. ఇండియాలోనే 'బ్యూటిఫుల్‌ డాన్సర్‌' అంటూ కితాబులిచ్చినా, 'పిలిస్తే వెళతాను' అని చెప్పినా సరే స్పందన లేదు. విషయం ఏమంటే మెగాస్టర్‌ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్‌ 150 చిత్రానికి ప్రభుదేవా డాన్స్‌ మాస్టర్‌గా అవకాశం రాలేదు. సినిమాలో చివరి రెండు పాటలకు జానీ, శేఖర్‌ మాస్టర్లు కంపోజ్‌ చేస్తున్నారు.'అభినేత్రి' సినిమా ప్రచారం సందర్భంగా 'చిరంజీవి పిలిస్తే వెళతాను' అని ప్రభుదేవా చెప్పారు. అప్పుడే 'ఇండియాలో వన్‌ అండ్‌ ఓన్లీ డాన్సింగ్‌ స్టార్‌ చిరంజీవి' అంటూ ప్రశంసించారు. ఇంత హడావుడి చేసినా సరే ప్రభుదేవా సేవలు 'ఖైదీ..' సినిమాకు ఉపయోగించుకోలేదు. లారెన్స్‌ చేత మాత్రం ఒక పాట చేయించారు. ప్రభుదేవాతో పాట చేయించుకోవాలని బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తే చిరు మాత్రం పక్కన పెట్టేశారు. తను అప్‌డేట్‌గా ఉండే ప్రయత్నంలో భాగంగా యువ మాస్టర్లతోనే కలిసి పనిచేస్తున్నారని అనుకోవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ