ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే తెదేపా ఎందుకు ఆమోదించింది? రావాల్సినవే ప్రకటించినప్పుడు అది ప్రత్యేక ప్యాకేజీ ఎలా అవుతుంది. దీనిపై నిజంగా తెదేపా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి అన్నాడు. తనకు ఎప్పుడైనా పార్టీలు, మనుషుల విధానాలపైనే కోపం గానీ, వ్యక్తులపై ఎలాంటి ద్వేషం లేదన్నాడు. తనెప్పుడు చంద్రబాబు, వైఎఎస్.జగన్మోహన్ రెడ్డి గార్ల పాలసీల మీదే పోరాటం చేస్తాను తప్ప వారిపై తనకు వ్యక్తిగత వైరుధ్యం లేవని వెల్లడించాడు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మాయమాటలు చెప్పి తప్పించుకుంటే మాత్రం నేను మీకు చాలా బలమైన శత్రువునని వివరించాడు. ఇక దశాబ్దాలుగా ప్రజలు చాలా అలసిపోయారని, ఇంకెంత కాలం ఈ పోరాటం చేయాలని ఆవేశంగా ప్రసంగించాడు. ఇంకా రాజకీయాలు అంటే.... కల్లూరి సుబ్బారావు, తరిమెల నాగిరెడ్డి వంటి గొప్ప వారిని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేయాలని, సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలని వివరించాడు. ఇంకా అనవసరంగా రాజకీయ విమర్శలు జనసేన చేయదని తెల్పాడు.
ఇంకా 1972లో ఓ జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకు మనం ఇప్పటకీ పన్నులు కడుతున్నామన్నాడు. చంద్రబాబు అయినా జగన్ అయినా తప్పులు సరిదిద్దకుండా ముందుకు వెళ్తే భావి తరాలు దెబ్బతింటాయన్నాడు. కాగా తాను ఆడ బిడ్డల మానసంరక్షణకు ముందుంటానని వివరించాడు. నేనెప్పుడు జై జవాన్ - జై కిసాన్ ను నమ్ముతానని, జనసేన రైతుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపాడు. కాగా తెదేపాలో టీడీపీ ప్రభుత్వంలో కరప్షన్ బాగా పెరిగిందని, ఈ విషయంపై తెదేపా నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నాడు. గతంలో ఆంధ్రా, తెలంగాణలా తిరిగి మళ్ళీ రాయలసీమ ఉత్తరాంధ్రలో వేర్పాటువాద ఉద్యమాలు రాకుండా ప్రభుత్వం కాస్త వెనకపడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వివరించాడు.
అయితే పవన్ అనంతపురంపై వల్లమాలిన ప్రేమను చూపిస్తూ ఈ జిల్లాకు కనీసం 100 టీఎంసీల నీరు కావాలి, కానీ ఇక్కడ కనీసం 30 టీఎంసీల నీరు కూడా రావడం లేదని ఇది పూర్తిగా మన నాయకుల చేతకాని తనానికి నిదర్శనమన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని ఉన్నత కులాల వారే ఉంటున్నారు తప్ప దళితులకు చోటు లేకుండా పోయిందన్నాడు. అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందితేనే సమసమాజ స్థాపన అంటూ వివరించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ తరహా రాజధాని అంటుంటాడు... లీక్ వాన్ యూ సింగపూర్ ను 25 సంవత్సరాలు పాలించాడు. సింగపూర్ అంటే ఎత్తైన కష్టడాలు కాదు. సింగపూర్ అంటే నిజాయితి. అవినీతి రహిత పాలన అని పవన్ ఆవేశంగా మాట్లాడాడు. తన సొంత స్నేహితుడు కరప్షన్ చేస్తేనే లీక్ వాన్ యూ అతన్ని జైళ్లో పెట్టించాడు. ఎత్తైన కట్టడాలు విశాలమైన రోడ్లు వేస్తే సింగపూర్ అయిపోదు. సింగపూర్ లాంటి అవినీతి రహిత సమాజం మనకు కావాలని పవన్ కళ్యాణ్ తెలిపాడు.
ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువెళతానని, ఇందుకోసం మోడీ అపాయింట్ మెంట్ను అడిగానన్నాడు. కాగా అనంతపురంలో కరువును పారదోలడానికి మనమంతా ఢిల్లీ వెళ్ళి పోరాటం చేద్దామని అందుకోసం తాను రైలు ఏర్పాటు చేస్తానని వివరించాడు. అనంతపురంలో కరువును నివారించడం, రాజకీయ నాయకుల్లో అవినీతిని పారదోలడం, అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ, నాయకులంతా ప్రజల కోసం, సమసమాజ నిర్మాణం కోసం పాటు పడేలా తన పోరాటం సాగుతుందని పవన్ ఆవేశంగా మాట్లాడాడు. అందుకోసం ఆయా పార్టీల వ్యక్తుల విధానాలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానన్నాడు. ఇందుకోసం 2019 ఎన్నికల్లో తాను జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్.