Advertisementt

హ్యాట్సాఫ్‌ టు దిల్‌రాజు....!

Sat 12th Nov 2016 03:22 PM
dil raju,telugu movies,distributors,sahasam swasaga sagipo movie,naga chaitanya,bahubali 2 movie,bahubali producers  హ్యాట్సాఫ్‌ టు దిల్‌రాజు....!
హ్యాట్సాఫ్‌ టు దిల్‌రాజు....!
Advertisement
Ads by CJ

ప్రధాని మోదీ నిర్ణయంతో రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల నిషేధం కొనసాగుతోంది. కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ బ్యాంకుల వల్ల చాలా ఆలస్యమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఏటీఎంలకు నగదు చేరలేదు. దీనికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టేలా ఉంది. దీంతో ఇప్పటికే తక్కువ మొత్తం నగదును బ్యాంకుల నుండి తెచ్చుకున్న వినియోగదారులకు చిల్లర ఇచ్చేనాథులు కనిపించడం లేదు. దీంతో ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో వారం రోజులు పట్టేలా ఉంది. కానీ మన అప్‌కమింగ్‌ స్టార్‌ హీరోల సినిమాలకే కాదు... బడా బడా స్టార్స్‌ చిత్రాలకు కూడా తొలివారమే కీలకం. కానీ నాగచైతన్య - గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ - మంజిమా మోహన్‌ - ఏఆర్‌ రెహ్మాన్‌ల కాంబినేషన్‌లో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావలసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాన్ని తప్పనిసరి పరిస్దితుల్లో విడుదల చేయాల్సిన పరిస్దితి. అందులోనూ ఈ చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య, తమిళంలో పెద్దగా మార్కెట్‌లేని శింబు వంటి మీడియం హీరోలు సోలోగా చేస్తున్న చిత్రం కావడం... అందునా ఈ వారం విడుదలయ్యే సోలో చిత్రంగా ఇవే ఉంటాయి కాబట్టి ఇతర చిత్రాల పోటీ పెద్దగా ఉండదు. కానీ ఈ చిత్రం విడుదలకు సిద్దమైందంటే మరీ ముఖ్యంగా ఈ చిత్రం విడుదలైదంటే అ ఘనత దిల్‌రాజుదే అని చెప్పాలి. ఆయన ఈ చిత్రం హక్కులు తీసుకున్న తర్వాత ఈ చిత్రం ఆలస్యంగా, పలు వాయిదాల అనంతరం విడుదలవుతున్నప్పటికీ దిల్‌రాజు మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లలో నమ్మకం పెరిగింది.  దిల్‌రాజుకు అన్ని ఏరియాలలోని డిస్ట్రిబ్యూటర్లతో, ఎగ్జిబిటర్లతో ఫెవికాల్‌ బంధం ఉంది. అంతేకాదు.. ఈమద్య అంటే ముఖ్యంగా ఎన్టీఆర్‌తో చేసిన 'రామయ్యా... వస్తావయ్యా' చిత్రం తర్వాత తన చిత్రాలను కేవలం చెక్స్‌ ద్వారానే లావాదేవీలు నడుపుతున్నాడు. ముఖ్యంగా ఆయన కీర్తి ప్రతిష్టలను, ఆయనపై డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న భరోసాను దెబ్బతీస్తూ కొందరు తెలంగాణ పంపిణీదారులు దిల్‌రాజును అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించారు. దిల్‌రాజు 'బాహుబలి-ది బిగినింగ్‌' లెక్కలను సరిగా నిర్మాతలకు చూపించలేదని, అందుకే నిర్మాతలు 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' హక్కులను దిల్‌రాజు అడిగినా ఇవ్వలేదని ప్రచారం జరిగింది. కానీ దిల్‌రాజు 'బాహుబలి' చిత్రం మొదటి పార్ట్‌ కొన్నప్పుడు ఆ చిత్రం లాభాలు గడించిన, గడించకపోయిన దిల్‌రాజు మాత్రమే రిలీజ్‌ చేయాలని, దానికి ప్రతిఫలంగా తమ చిత్రం మొదటి భాగం ఎంత లాభాలు తెచ్చినా తాము పట్టించుకోకుండా ఈ చిత్రం రెండో పార్ట్‌ను కూడా మొదటి పార్ట్‌ ధరకే ఇస్తామని 'బాహుబలి' నిర్మాతలతో పాటు రాజమౌళి సైతం దిలరాజుకే ఇస్తామని మాట ఇచ్చారట. ఈ చిత్రం నమ్మకాన్ని నిలబెడుతూ... ఈ చిత్రం మొదటిపార్ట్‌ అన్నిచోట్లా మంచి లాభాలను గడించింది. దీంతో తమ చిత్రానికి ఇంకా మంచి రేటు పలుకుతుండటంతో నిర్మాతలకు డబ్బు పిచ్చి ఎక్కువైందని, ఇంకా భారీ లాభాలు ఆర్జించాలని ఈ చిత్ర నిర్మాతలు భావించారు. దీంతో ఈ చిత్రం మొదటి పార్ట్‌కు వచ్చిన లాభాలను చూసిన ఇతర కార్పొరేట్‌ సంస్ధలు ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌కు విపరీతంగా రేటు పెంచేశారు. దీంతో నిర్మాతల ఆశ మరింత ఎక్కువైంది. సాక్షాత్తూ బాలీవుడ్‌లో 'బాహుబలి' మొదటి పార్ట్‌ అంతగా లాభాలు గడించడానికి, ఓపెనింగ్స్‌ రావడానికి కారణమైన కరణ్‌జోహార్‌ సైతం 'బాహుబలి 2'ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్న రేట్లు బెట్టింగ్‌తో సమానమని భావిస్తున్నారు. అందులో దిల్‌రాజుతో సహా కరణ్‌జోహార్‌ కూడా ఉన్నాడు. వాస్తవం ఇదైతే సోషల్‌ మీడియాలో మాత్రం నిర్మాతలు కావాలని దిల్‌రాజుకు ఇవ్వలేదని.... ఆయన పంపిణీ దారునిగా లెక్కలు సరిగా చూపించని కారణంగానే దిల్‌రాజుకు 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రాన్ని పంపిణీహక్కులను ఇచ్చిన నిర్మాతలే వద్దనుకున్నారనే దుష్ప్రచారాన్ని పెంచి పోషించారు. తమపైకి తప్పు రాకూడదనే ఉద్దేశ్యంతోనే కొందరు ఔత్సాహిక పంపిణీ దారులు, దిల్‌రాజు కంటే కొన్ని విషయాలలో సక్సెస్‌ను ఇస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ వంటి సంస్దలతో కలిసి 'బాహుబలి' నిర్మాతలు ఈ ప్రచారం చేస్తున్నారనే విషయం చాలామందికి అర్దమైంది. ఇలా పలు వివాదాల కారణంగా ఈ మద్య దిల్‌రాజు తన ప్రతి చిత్రానికి చెక్‌ల రూపంలోనే చెల్లింపులు చేయడమే కాదు.. ఇతరుల నుంచి రావాల్సిన మొత్తాలను కేవలం చెక్‌లుగానే తీసుకుంటున్నాడని సమాచారం. దీంతో దిల్‌రాజు 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రానికి చివరి రోజు బస్తాలలో డబ్బులు తేచ్చే పరిస్థితి ఏర్పడలేదు. ఇక ఈ చిత్రానికి కొంత అడ్వాన్స్‌ కట్టి, మోదీ నిర్ణయం వల్ల ఓపెనింగ్స్‌ సమస్య తలెత్తుందని భయపడిన డిస్ట్రిబ్యూటర్లు కూడా కేవలం దిల్‌రాజుపై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కు ముందు వచ్చారట. అలాగే కొంత మొత్తం బకాయీలు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా దిల్‌రాజు మొదట 'సాహసం శ్వాసాగా సాగిపో' చిత్రం అనుకున్న తేదీకి విడుదలయ్యేలా సహకరించండి.... సినిమాను ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు. బాకీ ఉన్నవారు ఈ ఆర్దిక లావాదేవీలన్నీ ముగిసి బ్యాంకుల్లో లావాదేవీలు మొదలైన తర్వాత చెక్‌ రూపంలోనే ఇవ్వమని చెప్పాడట. ఇదే ఈ చిత్రం తీసుకున్న వారికి దిల్‌రాజు నమ్మకం టానిక్‌లా ఉపయోగపడిందని, అలాగే రెండేళ్ల గ్యాప్‌ తర్వాత 'ప్రేమమ్‌' వంటి క్లాసికల్‌ హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులను, నాగచైతన్య చిత్రాలను ఎలా ఉన్నా చూసే అక్కినేని అభిమానులను, దిల్‌రాజు మీద ఉన్న నమ్మకం, 'ఏ మాయ చేశావే' కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌, దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఏ చిత్రం వచ్చినా చూసే ఆయన క్యాటగరీ ఆఫ్‌ ఆడియన్స్‌ వల్ల విడుదల విషయంలో పెద్ద చిక్కులు ఏర్పడలేదని అంటున్నారు. ఇవన్నీ నిజమైతే నిజంగా ఈ విషయంలో తెలుగు అసలు నిర్మాతలు దిల్‌రాజుకు రుణపడి ఉండాలని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ