నాగచైతన్యకు అదృష్టం సహకరించింది. 33 రోజులకే ముగిసిందనుకున్న సినిమా కొనసాగుతోంది. దీనికి కారణం దెయ్యం సినిమా. చైతు నటించిన 'ప్రేమమ్' హైదరాబాద్ సంధ్య 70 ఎం.ఎం.లో ప్రదర్శిస్తున్నారు. టాక్‌బావున్నా కలక్షన్లు లేకపోవడంతో గత గురువారం వరకే ప్రదర్శించాలని నిర్ణయించి టర్మినేషన్ చెప్పేశారు. బదులుగా 'అల్లరి' నరేష్ నటించిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' ప్రదర్శనకు ఏర్పాటుచేశారు. కానీ 'పెద్ద' నోట్ల రద్దు అలజడి కారణంగా దెయ్యం సినిమా నిరవధికంగా వాయిదా పడింది. దాంతో 'ప్రేమమ్'ను అదే థియేటర్లో కొనసాగిస్తున్నారు. ఈ విధంగా కొద్దిరోజులు చైతుకు కలిసివచ్చింది. చైతు నటించిన మరొక సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' శుక్రవారం రిలీజైంది. మార్కెట్‌లో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఉండడం విశేషం.