Advertisementt

పంచ్ డైలాగ్స్ ఏమో గాని మోదీ ప్రభావం చాలా!

Mon 14th Nov 2016 07:14 PM
narendra modi,500 and 1000 notes ban,film industries,release movies,modi effect on film industry,sss  పంచ్ డైలాగ్స్ ఏమో గాని మోదీ ప్రభావం చాలా!
పంచ్ డైలాగ్స్ ఏమో గాని మోదీ ప్రభావం చాలా!
Advertisement
Ads by CJ

ప్రధాని మోదీ తీసుకున్న రూ.500, రూ.1000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపి రిలీజ్‌కు సిద్దమవుతున్న చిత్రాల ఓపెనింగ్స్‌పై పెద్ద ఎఫెక్ట్‌ పడనుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఈ నిర్ణయం ప్రభావం సినిమాల ఓపెనింగ్స్‌పై, రాబోయే చిత్రాల విడుదల వంటి వాటి విషయంలో పెను సంచలనాలనే క్రియేట్‌ చేస్తోంది. మోదీ ఈ ఎఫెక్ట్‌కు భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా దీని తీవ్రత చూపుతోంది. ఈ విషయంలో దిల్‌రాజు కాదు కదా....! ఎవ్వరి ఇమేజ్‌, నిర్ణయాలు కూడా మోడీ నిర్ణయానికి మినహాయింపుగా కనిపించడం లేదు. ఎవ్వరి పప్పులు బాక్సాఫీస్‌ వద్ద ఉడకలేదు. వరుస ఫ్లాప్‌లలో ఉన్న నాగచైతన్య చిత్రం అంటే అది పెద్దగా ఓపెనింగ్స్‌ తెచ్చుకుంటుందని ఎవ్వరూ అనుకోరు. అందునా ఓ క్లాసిక్‌ మూవీ అంటే ఆ ఓపెనింగ్స్‌ మరింత డల్‌ అవుతాయి. అలాగే చైతూ నటించిన మలయాళ 'ప్రేమమ్‌' రీమేక్‌ కూడా పెద్దగా అంచనాలు లేకపోయినా, హీరో కెరీర్‌ సవ్యంగా లేకపోయినా, చిన్న దర్శకుడు, పెద్దగా క్రేజ్‌ లేని బేనరే అయినప్పటికీ ఈ చిత్రం తొలిరోజు రూ.2.5కోట్ల ఓపెనింగ్స్‌ను సాధించుకుంది. ఇది చైతూ స్దాయికి కాస్త అటుఇటుగానే ఉండి ఓకే అనిపించింది. ఈ చిత్రంతో సోలోహీరోగా మంచి విజయం సాధించుకున్నాడనే పేరు చైతూకు రావడం, అందునా అది చైతుకు మొదటి సూపర్‌హిట్‌ను అందించిన చైతూ- గౌతమ్‌మీనన్‌-రెహ్మాన్‌ల కాంబినేషన్‌లోనే విడుదలకు సిద్దమవ్వడం, గౌతమ్‌మీనన్‌కు తెలుగులో ఉన్న ప్రత్యేకత, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు విడుదలలో ఆలస్యం అయితే మంచి విజయం సాధిస్తాయనే నమ్మకం.

ఆకట్టుకున్న పబ్లిసిటీ, ఓ యాక్షన్‌ చిత్రం కావడం, సాధారణంగా యాక్షన్‌ సినిమాలను ఎక్కువగా ఆకర్షించే మాస్‌ ప్రేక్షకుల డామినేషన్‌, చివరి క్షణంలో దిల్‌రాజు ఈ చిత్రం విడుదల బాధ్యతలను తీసుకోవడంతో వచ్చిన హైప్‌ వంటివేమీ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం 'ప్రేమమ్‌' స్దాయి కలెక్షన్లను కూడా తొలిరోజు తెచ్చుకోలేకపోయింది. ఇక ఈ చిత్రానికి రివ్యూలు కూడా సరిగా రాకపోవడంతో ఈ చిత్రం తెలుగులో పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయింది. బ్యాడ్‌ మౌత్‌టాక్‌ ఈ చిత్రంపై మరింత ప్రభావం చూపింది. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు మాత్రం విడుదలకు ముందు మంచి క్రేజే వచ్చింది. శింబు మరలా ఈ చిత్రంతో తన విజయపరంపరను సాగిస్తాడనే ప్రచారం జరిగింది. అదే రోజున ఈ చిత్రం తమిళంలో కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొని రిలీజ్‌ అయింది. విచిత్రంగా ఈ చిత్రానికి తెలుగులో కంటే తమిళంలోనే మంచి టాక్‌ వచ్చిందని చెప్పాలి. కానీ ఈ చిత్రం తమిళంలో కేవలం రూ.76లక్షల గ్రాస్‌ను మాత్రమే తొలిరోజు సాధించింది. ఇక తెలుగులో ఈ మొత్తం రూ.50లక్షల లోపే అన్నది అక్షర సత్యం. ఇక ఈ ఎఫెక్ట్‌ టాలీవుడ్‌, కోలీవుడ్‌లనే కాదు.. బాలీవుడ్‌లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అక్కడ విడుదలైన 'రాక్‌ఆన్‌2' చిత్రం అక్కడ తొలిరోజు కనీసం హీనంగా తీసుకున్నా రూ.10కోట్లు కలెక్ట్‌ చేస్తుందని భావించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా కేవలం రూ. 2కోట్లు మాత్రమే వసూలు చేసి మోడీ ఎఫెక్ట్‌ అన్ని చోట్లా ఎంత ప్రభావాన్ని చూపిందో నిరూపించింది. ఇక ఈ చిత్రం కలెక్షన్లు త్వరలో విడుదల కానున్న చిత్రాలపై కూడా అంతే ప్రభావం చూపింది. 

అల్లరినరేష్‌ హీరోగా భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' చిత్రం విడుదల ఇక డిసెంబర్‌లోనే అంటున్నారు. వీటితో పాటు చిన్న చిత్రాలుగా విడుదలకు సిద్దమవుతున్న 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో పాటు కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి, పూర్ణలు జంటగా నటించిన 'జయమ్ము నిశ్చయంబురా'తో పాటు పలు చిత్రాల విడుదలను తేదీలను సందిగ్దంలో పడేసింది. తమిళ డబ్బింగ్‌ చిత్రాలైన విశాల్‌, తమన్నా, జగపతిబాబు వంటి క్రేజీ కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమైన 'ఒక్కడొచ్చాడు', 'బిచ్చగాడు' ఫేమ్‌ విజయ్‌ ఆంటోని 'భేతాళుడు' కూడా విడుదలయ్యేలా కనిపించడం లేదు. ఇక ఈనెల 18వ తేదీన అంటే వచ్చే శుక్రవారం నిఖిల్‌ హీరోగా వస్తున్న 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రం మాత్రమే విడుదల కానుంది. అయినా మహా మహా తలపండిన నిర్మాతలే భయపడుతున్న ఈ వేళ .. తమిళ డబ్బింగ్‌లైన 'ఒక్కడొచ్చాడు, భేతాళుడు' వంటి చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశం లేని పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నిఖిల్‌, ఆయన నిర్మాతలు ఇలా చిత్రాన్ని పట్టుబట్టి అదే తేదీన విడుదల చేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదని, ఈ సమయంలో స్టార్‌హీరోల చిత్రాలు వచ్చినా, సాక్షాత్తూ 'బాహుబలి2'నే వచ్చినా కలెక్షన్లు ఏ మాత్రం పెరగవంటున్నారు. ఇంకా ఏటీఎంలలో, బ్యాంకులలో లావాదేవీలు తీవ్ర జాప్యం అవుతున్నాయి. ఏటిఎంలలో 90శాతం ఇప్పటికీ పనిచేయడం లేదు. సాప్ట్‌వేర్‌ ప్రాబ్లమ్‌ వల్ల మరో రెండు మూడు వారాల వరకు కేవలం ఎటీఎంలలో రూ.100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, రోజుకు రూ.4వేలు డ్రా చేసుకునే నిబంధన ఉన్నప్పటికీ కొన్ని చోట్ల రూ.2వేలకి మించి అందించలేకపోతున్నారని తాజా సమాచారం. మరి ఈ పరిస్దితుల్లో నిఖిల్‌ డేర్‌ చేయడం కూడా ఆయన శ్రేయోభిలాషులకు నిద్రలేకుండా చేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ