Advertisementt

'ఖైదీ..' షూటింగ్ కి ఎంత మంచి లొకేషనో..!

Wed 16th Nov 2016 01:32 PM
khaidi no 150,sushmitha,chiranjeevi,khaidi no 150 shooting spot  'ఖైదీ..' షూటింగ్ కి ఎంత మంచి లొకేషనో..!
'ఖైదీ..' షూటింగ్ కి ఎంత మంచి లొకేషనో..!
Advertisement
Ads by CJ

చిరు 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150  ని ఎలాగైనా 2017 సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రొడ్యూసర్ రామ్ చరణ్, డైరెక్టర్ వి.వి.వినాయక్, హీరో చిరంజీవి శతవిధాలా కృషి చేస్తున్నారు. అందుకే విరామం లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఖైదీ చిత్ర షూటింగ్ స్లోవేనియా, క్రోయేషియా దేశాల్లో జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసున్నాయి. ఈ పిక్స్ ని చిరు పెద్ద కూతురు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తండ్రి తో సెల్ఫీ దిగిన ఫోటోని, ఖైదీ సాంగ్ షూట్ చేసిన వీడియో పిక్స్ ని సుస్మిత పోస్ట్ చేసింది. ఇక ఇప్పటికే చిరు 150  వ చిత్ర హీరోయిన్  కాజల్ తన టీమ్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అయితే చిరు కూతురు సుస్మిత ఈ ఖైదీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. ఇక ఈ ఫోటొస్ని పోస్ట్ చేసిన సుస్మిత ఖైదీ షూటింగ్ చెయ్యడానికి ఇంతకన్నా మంచి లొకేషన్ దొరకదేమో అని ట్వీట్ చేసింది. షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కావాలని చిత్ర యూనిట్  భావిస్తోంది. అంతేకాకుండా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని పబ్లిసిటీ పనుల్లోకి దూకాలని చూస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ