Advertisementt

పవన్ కి బెడిసి కొట్టింది..మరి ధనుష్ కి..!

Wed 16th Nov 2016 07:23 PM
pawan kalyan,dhanush,tamil star hero,vip 2,dhanush experiment  పవన్ కి బెడిసి కొట్టింది..మరి ధనుష్ కి..!
పవన్ కి బెడిసి కొట్టింది..మరి ధనుష్ కి..!
Advertisement
Ads by CJ

కళాకారుల్లో, మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే వారికి ఆల్‌రౌండర్స్‌గా నిరూపించుకొని, తమలో దాగివున్న బహుముఖ ప్రజ్ఞను చాటుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అలాగే వారికి సినిమాలలో నటించిన అనుభవం పెరిగేకొద్ది అన్ని శాఖలపై పట్టు వస్తుంది. దీంతో ఇతర శాఖల్లో తమకున్న పరిజ్ఞానంతో వారు దర్శకత్వంలోనే కాదు.. తమ ఇమేజ్‌కు తగ్గట్లుగా అన్ని ఉండాలని భావించి, డైరెక్టర్‌ నుండి రైటర్స్‌కు సంబంధించిన ప్రతి విభాగంలోనూ వేలు పెడుతుంటారు. ఇక తమకు అవకాశం రాని హీరోలు, దర్శకనిర్మాతలు కూడా అన్ని శాఖలను తామే నిర్వహించి సినిమాలు తీసి ప్రేక్షకులపై వదులుతుంటారు. కొందరు హీరోలు అన్ని విషయాలలో వేలు పెడుతున్నారన్న విమర్శలు వస్తే తమ చిత్రం బాగా ఆడాలనే ఉద్దేశ్యంతో సలహాలు ఇస్తున్నామని, అది ఇంటర్‌ఫియరెన్స్‌ కాదు.. ఇన్‌వాల్వ్‌మెంట్‌ అని వాదిస్తారు. కాగా నటులుగా మరీ ముఖ్యంగా స్టార్‌ హీరోలకు దర్శకత్వం వహించాలని, పాటలు, మాటలు, స్క్రీన్‌ప్లే వంటి వాటిని తామే చేసి, ఆన్‌ది స్క్రీన్‌ కూడా తమ పేరే పడాలని, తమ ప్రతిభ అందరికీ తెలియాలని భావించే వారికి అడగాలే గానీ ఎవరైనా అవకాశం ఇస్తారు. లేకపోతే తామే నిర్మిస్తూ, నచ్చినశాఖలను నిర్వహిస్తుంటడం సహజమే. పవన్‌కళ్యాణ్‌ నుండి శింబు వరకు ఇందుకు ఏ భాషా రంగం వారైనా మినహాయింపు కాదు. 

కాగా ఇప్పటికే నటునిగా నిరూపించుకొని స్టార్‌ హోదా పొందిన తమిళ స్టార్‌, రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన గాయకునిగా కూడా 'కొలవెరి...' పాటతో తన ప్రజ్ఞ చాటాడు. కాగా గత కొంతకాలంగా ధనుష్‌కు పెద్ద హిట్‌ లేదు. ఇటీవల వచ్చిన 'ధర్మయోగి' కూడా తమిళంలో కేవలం ఓ వర్గాన్ని మాత్రమే మెప్పించింది. ఆయనకు వచ్చిన చివరి బ్లాక్‌బస్టర్‌ 'విఐపి'. వేల్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కూడా 'రఘువరన్‌ బిటెక్‌'గా విడుదలై తెలుగు ఆడియన్స్‌లో కూడా ధనుష్‌కు క్రేజ్‌ పెంచింది. ఇక ప్రస్తుతం ధనుష్‌ 'విఐపి2' చిత్రం చేయనున్నాడు. ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తన మరదలు, రజనీకాంత్‌ కూతురు సౌందర్యకు అప్పగించాడు. ఇప్పటికే తన మామ రజనీకాంత్‌, 'కబాలి' ఫేమ్‌ రంజిత్‌పా కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మిస్తున్న దనుష్‌.. 'విఐపి2'ని కూడా తానే నిర్మించనున్నాడు. అంతేకాదు.. ఇందులో హీరోగా చేయడమే కాదు.. పాటలు, సంగీతం, మాటలు, స్క్రీన్‌ప్లే వంటి అన్ని బాధ్యతలు తానే తీసుకున్నాడు. చూడబోతే తెలుగు లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయోగం..తమిళ్ లో ధనుష్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. పవన్ ప్రయోగం ప్రతిసారి బెడిసి కొడుతున్న విషయం తెలిసిందే. మరి ధనుష్‌ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ