Advertisementt

బాలయ్య తో ఎన్టీఆర్.. నిజమేనా..?

Wed 16th Nov 2016 07:54 PM
balakrishna,junior ntr,director k raghavendra rao,balakrishna ntr combination new movie  బాలయ్య తో ఎన్టీఆర్..  నిజమేనా..?
బాలయ్య తో ఎన్టీఆర్.. నిజమేనా..?
Advertisement
Ads by CJ

ఒక క్రేజీ కాంబినేషన్ లో కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో ఒక  చిత్రం తెరకెక్కబోతుందని ఒక హాట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మామూలు కాంబినేషన్ కాదది అందుకే ఆ న్యూస్ అంతగా ప్రచారంలో కొచ్చింది. ఆ న్యూస్ సారంశమేమిటంటే నందమూరి బాలకృష్ణ ఆయన అన్నహరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే చిత్రం లో నటిస్తారని అంటున్నారు. మరి బాలకృష్ణ కి ఎన్టీఆర్ అంటే పెద్దగా పడదాయే. మరెలా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తాడా అని అనుకుంటున్నారా...! వారిద్దరిని ఒప్పించి ఈ సినిమా  చెయ్యాలని  డైరెక్టర్  రాఘవేంద్ర రావు ప్లాన్ చేస్తున్నాడట.

సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. మరి అంత మహోన్నత వ్యక్తి జీవిత కథలో బాలకృష్ణ నటించడానికి ఒప్పుకుంటాడని అంటున్నారు. ఇక అలాగే ఎన్టీఆర్ కూడా బాలకృష్ణతో కలవడానికి సిద్ధమై.. ఈ మధ్య బాబాయ్ ని తెగ పొగిడేస్తున్నాడు. ఇక బాలయ్యతో నటించడానికి ఎన్టీఆర్ కి ఏవిధమైన అభ్యంతరం ఉండదు. ఇక వీరిద్దరూ గనక ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తే నందమూరి ఫాన్స్ కి పండగే పండగ. 

ఎన్టీఆర్ తన జీవితం లో ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత పెద్ద పేరు సంపాదించాడో తెలిసిన విషయమే. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత కథలో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఏయే పాత్రల్లో నటిస్తారో కూడా ప్రచారం చేసేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ యువకుడి పాత్రలో  జూనియర్ ఎన్టీఆర్  నటించగా.....  ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనబడతాడని అంటున్నారు. మరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటిస్తే ఈ సినిమా మాములు సెన్సేషన్ కాదు. అలాంటి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడనే టాక్ కూడా బయటికి వచ్చింది. అసలు ఈ కాంబినేషన్ సెట్ అయితే ఈ సినిమా మీద అంచనాలు ఏ స్థాయికి చేరుకుంటాయో మీరే ఆలోచించండి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ