Advertisementt

గాలి కూతురి పెళ్ళికి.. రకుల్..భీభత్సం!

Thu 17th Nov 2016 11:50 AM
gali janardhan reddy,rakul preet singh,rakul dance,rakul remuneration,2 crores,gali marriage  గాలి కూతురి పెళ్ళికి.. రకుల్..భీభత్సం!
గాలి కూతురి పెళ్ళికి.. రకుల్..భీభత్సం!
Advertisement
Ads by CJ

గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రహ్మణీ పెళ్లి అంగరంగ వైభవం గా బెంగుళూరు ప్యాలెస్ లో అతిరధ మహారధులు, వి.వి.ఐ.పి. ల మధ్య చాలా రిచ్ గా జరుగుతుందని సమాచారం. ఇక ఈ పెళ్లిలో గాలి చాలా విశేషాలే చూపించబోతున్నాడు.  ఏకంగా ఈ వివాహానికి 650  కోట్లు ఖర్చు పెట్టాడని ప్రతిపక్షాలు  రాజ్యసభలో దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా ఒక అవినీతి నేత ఇంట పెళ్ళికి బిజెపి నేతలు హాజరవ్వడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. అదలా ఒక పక్క రచ్చ జరుగుతుంటే ఇటు గాలి మాత్రం కూతురి పెళ్ళిలో అనేక రకాల చిత్ర విచిత్రాలు ఆత్మీయులకు చూపించాడని అంటున్నారు. ఇక ఈ పెళ్ళిలో సినిమా తారలతో కూడా డాన్స్ చేపిస్తున్నాడని ఎప్పటినుండో  చెబుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో ఫెర్పార్మన్స్  చేయిస్తున్నాడని చెప్పారు. ఇక అటు బాలీవుడ్ తారలేమో గాని ఇటు టాలీవుడ్ తారలు, టాలీవుడ్ సింగర్స్ తో మాత్రం మాంచి ప్రోగ్రామ్స్ పెట్టించాడని కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియో లో టాలీవుడ్ టాప్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ ఇరగదీసేసింది. రకుల్ డాన్స్ ఫెర్పార్మన్స్ తో అక్కడున్నవారికి కిక్కిచ్చింది. అంతేకాకుండా రకుల్ డాన్స్ భీభత్సంగా చేసేసిందని ఆ వీడియో  చూసిన వాళ్ళు కామెంట్స్ పడేస్తున్నారు. మరి ఆ స్థాయిలో పెళ్ళికి వచ్చిన వాళ్ళని గాలి సంతోషపెట్టేసాడు. ఇక ఈ పెళ్లి మాత్రం సినిమా సెట్టింగ్స్ ని తలతన్నేలా  చేసాడని ఆ వాతావరణాన్ని చూసిన వాళ్ళు అంటున్న మాట. మరి ధనికుల దగ్గరనుండి  సామాన్య ప్రజలు వరకు డబ్బులు కోసం అల్లాడుతుంటే గాలి మాత్రం దర్జాగా ఈ పెళ్లిని మర్చిపోలేని రీతిలో ఎలా చేసాడో అని అందరూ బహిరంగం గానే ముచ్చటించుకుంటున్నారు. అయితే ఈ డాన్స్ ఫెర్పార్మన్స్ ఇచ్చినందుకు గాను రకుల్ భారీ మొత్తంలో వసూలు చేసిందని అంటున్నారు. ఆ ఫిగర్ చూస్తే మీరు అమ్మో అంటారు. రకుల్ ఒక్క సినిమాకి తీసుకునే  పారితోషికం కంటే ఎక్కువ తీసుకుందని టాక్. ఆ ఫెర్పార్మన్స్ కి అక్షరాలా రకుల్ 2  కోట్లు తీసుకుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఫిగర్ చూసిన వాళ్ళు మాత్రం ఆమ్మో అంతా అని నోరెళ్లబెడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ