Advertisementt

కాజల్..ఎంతవరకైనా..రెడీ అంటోంది..!

Thu 17th Nov 2016 04:26 PM
kajal agarwal,entha varaku ee prema movie,jiiva,kajal glamour dose,janatha garage  కాజల్..ఎంతవరకైనా..రెడీ అంటోంది..!
కాజల్..ఎంతవరకైనా..రెడీ అంటోంది..!
Advertisement
Ads by CJ

కాజల్ బాగా గ్లామర్ డోస్ పెంచేసింది. అసలే ఈ మధ్యన సినిమాలు లేక ఖాళీగా జపం చేసిన కాజల్ కి అటు తమిళం లోను ఇటు తెలుగులోనూ లక్కీగా రెండు సినిమాలు తగిలాయి. ఇక అమ్మడు రెచ్చిపోయి ఈ సినిమాల్లో నటించేస్తుందని అంటున్నారు. మరి మాములుగా మత్తెక్కించడం లేదు కాజల్ తమిళ సినిమాలో..... కాజల్ ఫొటోస్ చూస్తుంటే. అమ్మడు చేతిలో వున్న సినిమాలతోనే బాగా హాట్ గా కనిపిస్తే మళ్ళీ కాస్త బిజీ అవ్వవచ్చనే ఉద్దేశ్యంతో తన అందాలను ఇలా ఆరాబోసేస్తుందట. అంతేలే దీపం ఉండగానే అన్నట్లుగా..అవకాశం వున్నప్పుడే ఇలా గ్లామర్ తో రెచ్చిపోయి అన్ని చక్కబెట్టుకోకపోతే ఇంకేమన్నా ఉందా... లేకపోతె పద్దతిగా కనిపిస్తే ఇంట్లో ఖాళీగా కూర్చుని గోళ్లు  గిల్లుకునే పరిస్థితి వస్తుందని కాజల్ అలా తయారయ్యిందని అంటున్నారు. 

కాజల్ తెలుగులో జనతా గ్యారేజ్ లో ఒక ఐటెం సాంగ్ లో ఎంతలా తన అందాలను పరిచిందో అందరూ చూసేసారు. ఇక ఇప్పుడు ఖైదీ... లో ఎలా వుండబోతుందో అనేది ప్రస్తుతానికి  కాస్త సస్పెన్స్ గా  మెయింటింగ్  చేస్తూ కాజల్ లుక్ ని మాత్రం విడుదల చెయ్యడం లేదు ఖైదీ... చిత్ర యూనిట్. అయితే కాజల్ తన అందాలతో ఎంతలా రెచ్చిపోతుందో తమిళ సినిమా 'ఎంతవరకు ఈ ప్రేమ' లో కనిపిస్తుంది. ఈ సినిమాలో జీవా పక్కన కాజల్ చాలా హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుందని ఆ సినిమా స్టిల్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక స్టిల్స్ లోనే ఇలా ఉంటే పూర్తి సినిమాలో ఎంతవరకైనా కాజల్ రెడీ అని అనుకోవడం ఖాయం. ఈ ఫొటోస్ లో కాజల్ చీర కట్టుతో అదిరిపోయే ఫోజుల్లో కనిపిస్తుంది. ఇంకా కాజల్ ఇలాంటి అందాలు ఆస్వాదించాలంటే ఆ సినిమా విడుదల వరకు వెయిట్ చెయ్యక తప్పదు. 

Click Here to See the Entha Varaku Ee Prema More Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ