Advertisementt

బడా బాబుల లిస్ట్ లో నాగ్..లేడు..!

Fri 18th Nov 2016 02:10 PM
nagarjuna,bank interest,nagarjuna response on rumors,nagarjuna twit on rumors  బడా బాబుల లిస్ట్ లో నాగ్..లేడు..!
బడా బాబుల లిస్ట్ లో నాగ్..లేడు..!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున ఒకపక్క హీరోగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు అనేకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఇక వ్యాపార లావాదేవీల్లోనే  నాగార్జున బ్యాంకుల  నుండి అప్పు తీసుకుని వాటిని కట్టకుండా బకాయిలు పడ్డాడనే వార్తలు ఈ మధ్యన మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి. ఈ వార్తలకు స్పందించిన నాగార్జున నేను ఏ బ్యాంకుకి బకాయి పడలేదని నేను తీసుకున్న లోన్ ని కట్టలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నాడు. అసలు నేను అన్నపూర్ణ స్థూడియోస్ అభివృద్ధి చెయ్యడానికి గతంలో బ్యాంకు నుండి అప్పుతీసుకున్న మాట వాస్తవమే గాని వాటిని ఈ ఏడాది మొదట్లోనే కట్టేశానని స్వయం గా సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. మరి ఇప్పటికే బడా బాబులు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి తమ స్వార్ధానికి బ్యాంకులని బలిచేస్తున్నారనే వార్తలు నిత్యం మీడియాలో దర్శనమిస్తూనే వున్నాయి. ఇక ఈ బడాబాబుల లిస్ట్ లో నాగార్జున పేరును కూడా చేర్చేసింది మీడియా. ఇక ఈ వార్తలకు నాగార్జున వివరణ ఇచ్చి సకాలంలో ఈ గాసిప్స్ కి చెక్ పెట్టాడని అందరూ ఇప్పుడు నాగ్ ని పొగిడేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ