Advertisementt

ఆమె అందంకి వున్న పవర్ అలాంటిది..!

Fri 18th Nov 2016 03:03 PM
keerthi suresh,nenu sailaja,pawan kalyan,mahesh babu,nenu local  ఆమె అందంకి వున్న పవర్ అలాంటిది..!
ఆమె అందంకి వున్న పవర్ అలాంటిది..!
Advertisement
Ads by CJ

'నేను...శైలజ'తో తెలుగు ప్రేక్షకులకు చేరువై తమిళంలో కూడా 'రజనీ మురుగన్‌'తో సూపర్‌హిట్‌ కొట్టి తమిళ అభిమానులు ఆమెకు గుడి కట్టేంతగా ఆకర్షించి, అతి తక్కువ చిత్రాలతోనే సంచలనం సృష్టించిన హీరోయిన్‌ కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఆమెకు తమిళంలో స్టార్‌హీరోల సరసన ఆఫర్లు వస్తున్నాయి. విజయ్‌తో 'భైరవ' చిత్రంతో పాటు పలు చిత్రాలు చేస్తోంది. స్టార్స్‌తో ఆమెకు తెలుగు, తమిళంలో పలు ఆఫర్లు వస్తున్నప్పటికీ నటనకు స్కోప్‌ ఉండే పాత్రలను ఒప్పుకుంటూ, కేవలం గ్లామర్‌రోల్స్‌ చిత్రాలకు మాత్రం నో చెబుతోంది. అలా పలు స్టార్‌హీరోల చిత్రాలకు నో చెప్పిన కీర్తి ప్రస్తుతం నాని వంటి అప్‌కమింగ్‌ స్టార్‌ సరసన నటిస్తోంది. తమిళంలో కూడా ఇలానే ఆమె కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటూ వస్తోంది. 

తాజాగా ఆమె టాలీవుడ్‌ నెంబర్‌వన్‌ హీరోలుగా చలామణి అవుతున్న పవన్‌, మహేష్‌లతో జతకట్టనుంది. తెలుగు దర్శకుల్లో పెద్దగా గ్లామర్‌ ప్రదర్శన చేయించకుండా హీరోయిన్లకు కూడా ఇంపార్టెంట్‌ రోల్స్‌ను డిజైన్‌ చేసే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. పవన్‌తో చేయబోయే చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా కీర్తి ఎంపికైంది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించబోయే దానయ్య చిత్రంలో కూడా ఆమెను ఎంపిక చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తాను హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని ఆమె కన్‌ఫర్మ్‌ చేసింది. కానీ మహేష్‌, కొరటాల చిత్రంపై మాత్రం ఆమె పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆమె తాను టాలీవుడ్‌లో మరోస్టార్‌ సరసన నటించే ఆఫర్‌ వచ్చినట్లు తెలిపి, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మురుగదాస్‌ చిత్రంతో ద్విభాషా చిత్రం చేస్తున్న మహేష్‌, కొరటాల శివ చిత్రాన్ని కూడా తమిళంలో కూడా రిలీజ్‌ చేయనున్నాడని, అందుకే అక్కడ కూడా మంచి క్రేజ్‌ ఉన్న కీర్తిని తీసుకోవాలని కొరటాల, మహేష్‌లు డిసైడ్‌ అయి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ