Advertisementt

'బిచ్చగాడు'కి మరో హిట్ పక్కా...!

Fri 18th Nov 2016 06:53 PM
bichhagadu,bethaludu,vijay antony,10 min video  'బిచ్చగాడు'కి మరో హిట్ పక్కా...!
'బిచ్చగాడు'కి మరో హిట్ పక్కా...!
Advertisement
Ads by CJ

అప్పుడెప్పుడో ఆ మధ్యన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే యూట్యూబ్ లో కొంత సినిమా వచ్చేసింది. అది చేసింది ఎవరో అని చెప్పనప్పటికీ ఆ లీకులు మాత్రం అత్తారింటికి చిత్ర యూనిట్ యే చేసిందని  చాలామంది అన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే అలా చేసిందని ప్రచారం జరిగింది. అసలు ఇంతకీ అలా యూట్యూబ్ లో సినిమా కొంచెం లీక్ అయినా కూడా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయినా యే సినిమా అయినా కూడా ట్రైలర్స్ తో, టీజర్ తో లేక సాంగ్ బిట్స్ తో ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం తాజాగా సినిమా ప్రమోషన్ లో ఒక వెరైటీ ప్రమోషన్ ని మొదలెట్టింది. 

ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన తమిళ మూవీ సైతాన్ తెలుగులో భేతాళుడుగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఆ చిత్ర యూనిట్ కొంచెం వెరైటీ గా ఆలోచించి ఏకంగా 10 నిమిషాల సినిమా వీడియోని విడుదల చేసింది. ఇక ఈ 10  నిమిషాల వీడియో బిట్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ 10 నిమిషాలే  సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. విజయ్ ఆంటోని హీరోగా చేస్తున్న సైతాన్ ఒక థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కింది. ఇంకా ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని విజయ్  ఆంటోనీ ఇరగ్గొట్టేసాడని ఆ 10  నిమిషాల వీడియో లో తెలిసిపోతుంది.. ఇక సైతాన్ మూవీ లో హీరో గా, మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్  ఆంటోనీ ఇరగదీశాడని సినిమా రిలీజ్ అవ్వకుండానే చెప్పేస్తున్నారు సినీ జనాలు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ