గత కొన్ని రోజులుగా గీతామాధురి బిగ్ స్క్రీన్‌పైకి వస్తుందనే న్యూస్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే ఈ న్యూస్‌లో ఎటువంటి నిజం లేదని గీతామాధురి సైడ్ నుండి తెలుస్తుంది. టాలీవుడ్‌లో కావాలనే కొందరు ఈ న్యూస్‌ని పుట్టించారని తెలుస్తుంది. తనదైన స్వరంతో..ఐటమ్‌సాంగ్స్‌ని అల్లాడించేస్తూ..దూసుకెళుతున్న గీతామాధురి..ఆ మధ్య 'అతిధి' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించిన విషయం తెలిసిందే. దీన్నే అదునుగా తీసుకుని కొందరు..గీతామాధురిలో హీరోయిన్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని, అతి త్వరలో గీతామాధురి బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉండబోతుందనే న్యూస్‌ని క్రియేట్ చేసి మీడియాకి వదిలారు.
అయితే దీనిపై స్పందించిన గీతామాధురి..వెండితెరపై తను ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని ఖండించింది. అలాంటిదేమీ లేదని..తనకసలు అలాంటి ఆలోచనే లేదని తెలిపింది. కావాలని కొందరు క్రియేట్ చేసిన న్యూస్‌గా..గీతామాధురి తెలిపింది. ఒకవేళ తను నిజంగానే వెండితెరపై నటించేట్లు అయితే స్వయంగా తానే మీడియాకి తెలియపరుస్తానని, ప్రస్తుతం సింగర్‌గా, భార్యగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నానని, దయచేసి ప్రస్తుతం వస్తున్న వార్తల్ని నమ్మవద్దని ఆమె తెలియపర్చింది. సో..దీంతో గీతామాధురి వెండితెర ఎంట్రీ లేనట్టేనని తెలుస్తుంది. గతంలో కూడా గీతామాధురిపై ఇటువంటి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.