నయనతార సినిమాల్లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ నిజ జీవితలో మాత్రం లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతుంది. ఒక్కసారంటే ఓకె గాని మరీ రెండు సార్లు ప్రేమలో విఫలమైంది. అయితే నయన్ మాత్రం రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ప్రేమలో పడింది. మరి ఈసారైనా తన ప్రేమను నిలబెట్టుకుని సక్సెస్ ఫుల్ గా పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు ఇంకా అందరిలో వున్నాయి. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న నయన్ ఇప్పుడు తాజాగా పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని బహిరంగంగానే తిరుగుతున్నారు. ఇక ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలని నయన్, విగ్నేష్ అనుకుంటున్నారని సమాచారం. అసలిప్పటికే నయన్ పెళ్లి విగ్నేష్ శివన్ తో ఎప్పుడో అయిపోయిందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ వీరి పెళ్ళి అవ్వలేదని ఇప్పుడు తాజాగా పెళ్ళి గురించే ఇరు కుటుంబాల్లో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి ఇప్పటికే రెండుసార్లు పెళ్లివరకు వెళ్లి వెనక్కొచ్చిన నయనతార ఈసారి మాత్రం తన పెళ్లి విషయం లో చాలా సీరియస్ గానే ఉందని అంటున్నారు.