Advertisementt

సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న `అల్లుడు సింగం`..!

Mon 21st Nov 2016 11:51 AM
raghunanda nr music director,voice venkat,producer ravipati satyanarayana,director rajasekhar,anjali  సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న `అల్లుడు సింగం`..!
సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న `అల్లుడు సింగం`..!
Advertisement
Ads by CJ

షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నహీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం `అల్లుడు సింగం`. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ `తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతో్న్న‌`అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని విధంగా లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డనుంది. ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో  సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌న‌మాలి రాశారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌జేశారు. 

ఈ చిత్రానికి సంగీతంః ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్‌, మాట‌లుః వెంక‌ట్‌, నిర్మాతః రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడుః రాజ‌శేఖ‌ర్‌

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ