అందాల కథానాయిక, సంపాదనే ధ్యేయంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఐటి శాఖ షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు ఇటీవల గాలి జనార్థనరెడ్డి కూతురు పెళ్ళికి 'ప్రత్యేక' అతిథిగా వెళ్ళింది. ఇందుకోసం భారీ మెుత్తం తీసుకుందని ప్రచారం జరిగింది. పెళ్ళిళ్ళకు తారలు వెళ్ళడం సహజమే అయినప్పటికీ 'గాలి' చేసిన పెళ్ళి పెద్ద దుమారాన్ని లేపింది. వందల కోట్లు ఖర్చు పెట్టాడని ప్రచారం జరిగింది. ఈ లెక్కలు బయటకు తీసేందుకు ఐటి శాఖ రంగంలోకి దిగింది. పెళ్ళి ఖర్చుల లెక్కలు తేల్చే పనిలో పడింది. ఇందులో భాగంగా ఎవరెవరికి ఎంత ఇచ్చారనే సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. అందుకే రకుల్ కు తాకీదులు అందాయని తెలిసింది. దీనిపై ఆమె స్పందన ఎలా ఉండబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది.