Advertisementt

నాగ్ సెంటిమెంట్ చరణ్ కు ఉంటుందా?

Wed 23rd Nov 2016 05:35 PM
ram charan,akkineni nagarjuna,dhruva movie,december sentiment  నాగ్ సెంటిమెంట్ చరణ్ కు ఉంటుందా?
నాగ్ సెంటిమెంట్ చరణ్ కు ఉంటుందా?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో సెంటిమెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే సినీ ముహూర్తాల ప్లేస్, రిలీజ్ డేట్ పక్కగా ప్లాన్ చేస్తారు. అక్కినేని నాగార్జునకు డిసెంబర్ సెంటిమెంట్ ఉంది. డిసెంబర్ లో విడుదలైన 'మన్మథుడు', 'కింగ్', 'రగడ', 'ఉయ్యాల జంపాల' చిత్రాలు ఆయనకు విజయం తెచ్చిపెట్టాయి. ఈ సెంటిమెంట్ ఫాలో అవడానికి ఆయన ప్రయత్నిస్తారు. 'నమో వేంకటేశాయ' చిత్రాన్ని కూడా తొలుత డిసెంబర్ అనుకున్నప్పటికీ, తప్పని పరిస్థితుల్లో ఫిబ్రవరికి మార్చారని అంటున్నారు. ఇకపోతే యువహీరో రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో విడుదలవుతున్న భారీ చిత్రమిది. నోటు ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం పక్కన పెడితే నాగార్జునకు కలిసి వచ్చిన సెంటిమెంట్ తమకు కూడా ఉంటుందా? అనే సంశయం మాత్రం ఉందట. విజయదశమికి రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ చివరికి డిసెంబర్ 9 వరకు వెళ్ళింది. తమిళ రీమేక్ ఆధారంగా తీస్తున్నారు కాబట్టి మినిమం గ్యారంటీ అని చిత్ర బృందం నమ్ముతోంది. పైగా ఈ సినిమా మేకర్ అల్లు అరవింద్ కావడంతో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. హిట్ సినిమాగా మలచడానికి కృషి చేస్తారని మెగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ