Advertisementt

బాహుబలి కి మైనస్...నాగ్ కి ప్లస్..!

Fri 25th Nov 2016 06:59 PM
bahubali,bahubali 2 movie scenes leaked,nagarjuna namo venkatesaya safe,krishna dayananda  బాహుబలి కి మైనస్...నాగ్ కి ప్లస్..!
బాహుబలి కి మైనస్...నాగ్ కి ప్లస్..!
Advertisement
Ads by CJ

నిజంగానే బయటివారు లీక్‌లు చేస్తున్నారో లేక యూనిట్‌ వారే ప్రమోషన్‌ కోసం ఇలా చేస్తున్నారో తెలియదు కానీ ఈమధ్య చాలా చిత్రాలు విడుదలకు ముందే లీక్‌ అవుతున్నాయి. బాహుబలి2 చిత్రంలోని యుద్ద సన్నివేశాలలో పాటు అనుష్కతో ప్రభాస్‌ నటించిన కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ కూడా లీకవ్వడం సంచలనం సృష్టించింది. 'బాహుబలి పార్ట్‌1'చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కూడా ఇలాగే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా 'బాహుబలి2' కి చెందిన క్లిప్పింగ్‌లను ఎడిటింగ్‌ విభాగంలో పనిచేసే కృష్ణదయానంద డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని తన స్నేహితులకు షేర్‌ చేశాడు. ఇలా ఇవి బయటకు లీకయ్యాయి. దీనికి సంబంధించిన ఆరుగురు విద్యార్ధులను విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా మరో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే... ఈ ఆరుగురి యువకుల్లో ఒకరి వద్ద నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఓం నమో వేంకటేశాయ' క్లిప్పింగ్‌లు కూడా ఉన్నాయని పోలీసులను గమనించారు. కానీ అదృష్టవశాత్తు ఇవి ఇంకా ఎవ్వరికీ షేర్‌ కాలేదు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాగా 'బాహుబలి2'లోని క్లిప్పింగ్‌లు లీకై వాటిని తొలగించేలోపే ఎందరో వాటిని చూసేశారు. ఇందులోని అనుష్కను చూసి కామెంట్స్‌ కూడా మొదలుపెట్టారు. 'సైజ్‌జీరో' తర్వాత లావు తగ్గిందనుకున్న అనుష్క ఇంకా లావుగానే ఉందని, ఆమె ప్రభాస్‌ సరసన అస్సలు బాగాలేదనే కామెంట్స్‌ ఇండస్ట్రీలో కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలన్నీ బయ్యర్ల వరకు చేరితే ఈ చిత్రం బిజినెస్‌పై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ చిత్ర నిర్మాతలతోపాటు రాజమౌళి, ఇతర యూనిట్‌ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ