మోదీ కరెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ భూమికి దిగిరావడం ఖాయం. ఇంతకాలం విపరీతంగా రెక్కలొచ్చిన స్థిరాస్దుల ధరలు ఇప్పుడు పెద్దగా పెరిగే అవకాశం లేదు. రియల్‌ఎస్టేట్ పరిస్థితి మరలా యథాస్దితికి వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్ధికవేత్తలు సూత్రీకరిస్తున్నారు. దీంతో చిరంజీవి సైతం ఇక తనకున్న స్థలాలు, భవనాలు వంటి స్దిరాస్దులను నమ్ముకోకుండా దీర్ఘకాలంలో మంచి లాభాలను ఆర్జించి పెట్టే అవకాశం ఉన్న మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో రూ.500కోట్లు డిపాజిట్ చేశాడంటూ తాజాగా ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. తన పేరు మీద, తన భార్య పేరు మీద ఉన్న ఆస్దులతోపాటు కొడుకు చరణ్, కోడలు ఉపాసన పేర్ల మీద కూడా ఉన్న స్థలాలు, భవనాలలో కొన్నింటిని అమ్మివేసి, దాని ద్వారా వచ్చిన 500కోట్లను మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టాడని ప్రచారం జరుగుతోంది. అయితే స్దిరాస్ధులు అమ్మగా వచ్చిన సొమ్ము వైట్ మనీనే కావడంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆయన ఈ నిర్ణయాన్ని ఎంతో తెలివిగా తీసుకున్నాడంటున్నారు. మరి ఈ వార్తే నిజమైతే చిరు ముందుచూపును ప్రశంసించాల్సిందే.