'ధృవ' సినిమాలో అవకాశం వచ్చినందుకు రకుల్ ప్రీత్ సింగ్ తెగ సంతోషంగా ఉంది. తమిళ మాతృక 'తను ఒరువన్' చూశాక అందులో నటించే అవకాశం తనకే రావాలని కోరుకుందట. లక్కీగా వచ్చేసింది. తమిళంలో నయనతార పోషించిన పాత్రను తెలుగులో రకుల్ చేస్తోంది. నయన, రకుల్ ల గ్లామర్ వేరు వేరు. నయనలో ఉండే సెక్సప్పీల్ రకుల్ లో తక్కువే అంటారు. ఇక బాడీని రొమాంటిక్ గా చూపించడంలో నయన తర్వాతే ఎవరైనా, అలాగే కళ్ళతోనే భావాలు పలికిస్తుంది. మరి ఇలాంటి ప్లస్ పాయింట్స్ రకుల్ లో కనిపిస్తాయా? అంటే డౌటే. ఒక సందర్భంలో నయనతారను 'ధృవ'లో నటింపజేయాలని ప్రయత్నించినా, ఆమె బాలకృష్ణ, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటించి ఉండడం వల్ల ఆ ఆలోచన మానుకున్నారట. దీంతో రకుల్ కు ఫక్తు మాస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. రామ్ చరణ్ తో మరోసారి జోడీ కట్టింది. నయనతారను మరిపించేలా రకుల్ నటిస్తుందా? అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాలి. భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకువస్తోంది.