దిల్‌రాజు నిర్మించిన సూపర్‌హిట్ మూవీ 'కొత్త బంగారులోకం'తో టాలీవుడ్‌కు పరిచయమైన టాలెంటెడ్ ఆర్టిస్ట్ శ్వేతబసు ప్రసాద్. అతి చిన్న వయసులోనే బాలనటిగా నేషనల్ అవార్డును అందుకున్న నటి ఆమె. కాగా ఆమె ఆమధ్య ఓ వ్యభిచారం కేసులో ఇరుక్కుంది. దీంతో ఆమె పరిస్థితి చూసి బాధపడిన పలువురు దర్శకనిర్మాతలు, హీరోలు తమ చిత్రాలలో ఆమెకు అవకాశం ఇస్తామంటూ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చెప్పారు. మంచు విష్ణు అయితే ఆమెకు వరస అవకాశాలు ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఎవ్వరు మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఆమె మరలా బుల్లితెరకే పరిమితమైంది. ఏక్తాకపూర్ ఆమెకు సాయం చేస్తానన్న మాటను నిలబెట్టుకుంది. ఆమె సహాయసహకారాలతో హిందీ బుల్లితెర సీరియల్‌లో 'చంద్రనందిని'గా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ సీరియల్‌లో ఆమె చంద్రగుప్త మౌర్యుని భార్యగా కనిపిస్తోంది. అవకాశాలు వస్తే తెలుగు టీవీ సీరియళ్లలో కూడా నటించడానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాను ప్రాణంగా భావించే నటనను వదిలిపెట్టనని, ఎలాంటి అవకాశాలు వచ్చినా చేస్తానని చెబుతోంది. కాగా ప్రస్తుతం ఆమె ఆర్ధిక పరిస్థితి కూడా దారుణంగానే ఉందంటున్నారు. దీంతో ఆమె బుల్లితెర, పెద్ద తెర అనే తేడా లేకుండా ఏ అవకాశం వచ్చినా నటిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తోంది.