Advertisementt

ఎంత ప్రేమికులైతే..ఇంత శృతిమించాలా..!

Sun 27th Nov 2016 04:42 PM
naga chaitanya,samantha,party,public function,over dose  ఎంత ప్రేమికులైతే..ఇంత శృతిమించాలా..!
ఎంత ప్రేమికులైతే..ఇంత శృతిమించాలా..!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య, సమంతలు కలసి చాలా సినిమాలలో కలిసి నటించి ఎప్పటీనుంచో ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. కాగా త్వరలో వీరు పెళ్లి చేసుకోవడానికి పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగిపోయింది. దాంతో చైతూ, సమంతలు కలిసి కొన్ని పార్టీలకు, ఈవెంట్స్‌కు, ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నారు. ఇక షూటింగ్‌లేని సమయాలలో ఏకాంతంగా గడుపుతూ పెళ్లికి ముందే అడ్వాన్స్‌ అయిపోతున్నారు. త్వరలో వీరిద్దరి పెళ్లి ఖాయమయిందనే సంగతి తెలిసినప్పటికీ పెళ్లయ్యే వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండలేరా? అని కొందరు సంప్రదాయవాదులు ప్రశ్నిస్తున్నారు. కాగా తమ పనేదో తాము చేసుకోకుండా, అలా పార్టీలలో డ్యాన్స్‌లు చేసిన ఫొటోలు, ఏకాంతంగా ఉన్న ఫొటోలను ఎవరో అడుగుతున్నట్లు అదే పనిగా సమంత సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఇలా వారి ఫొటోలను వారే పోస్ట్‌ చేసుకుంటూ ఉండటాన్ని కొంత మంది తప్పుపడుతున్నారు. తాజాగా సమంత ఓ పార్టీలో తాను, చైతూ కలిసి చేసిన డ్యాన్స్‌లోని కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. నిజానికి ఇవి కాస్త డోస్‌ను మించే ఉన్నాయని ఒప్పుకోవలసిందే. దీంతో ఈ ఫొటోపై ఘాటైన కామెంట్స్‌ వస్తున్నాయి. కానీ పెళ్లి నిశ్చయమైన వారు ఇలా చేయడంలో తప్పేమిటి? దానిని ఎందుకు విమర్శిస్తున్నారు? అంటూ అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వాదనలో ఇరుపక్షాలది తప్పుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ