Advertisementt

నాడు 'పంజా' నేడు 'ధృవ'..!

Tue 29th Nov 2016 02:38 PM
ram charan,dhruva movie,power star pawan kalyan,panja movie,director surender reddy,music director hiphop tamizha,produced by allu aravind,heroine rakul preet singh  నాడు 'పంజా' నేడు 'ధృవ'..!
నాడు 'పంజా' నేడు 'ధృవ'..!
Advertisement
Ads by CJ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' థియేట్రికల్ ట్రైలర్స్ తో అంచనాలు పెంచుకుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్ నట విశ్వరూపం చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. వ్యూహాత్మకంగా డిసెంబర్ 9 రిలీజ్ డేట్ ఎంపికచేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద సినిమాలు లేవు.మళ్లీ సంక్రాంతి సీజన్ వరకు 'ధృవ'కు ఎలాంటి అడ్డంకులు లేవు. 

ఇకపోతే సరిగ్గా 2011లో బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన 'పంజా' చిత్రం కూడా డిసెంబర్ 9నే విడుదలైంది. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది.'పంజా' చిత్రం ఎలాంటి ఫలితం సాధించిందో ప్రేక్షకులకు తెలుసు. బాబాయ్, అబ్బాయి సినిమాల రిలీజ్ డేట్లు కలవడం కాకతాళీయమే అనుకోవచ్చు. అయితే డిసెంబర్ నెల సహజంగా అందరికీ కలిసిరానప్పటికీ, గత ఏడాది 'బెంగాల్ టైగర్' మంచి విజయాన్ని సాధించింది. గతంలో నాగార్జునకు కూడా డిసెంబర్ నెల కలిసి వచ్చింది. ఇదే సెంటిమెంట్ చరణ్ కు వర్కౌట్ అవుతుందని భావించవచ్చు. 'ధృవ' రీమేక్ సినిమా. అంటే మినిమం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ