నాగ చైతన్య - సమంతల పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని చెబుతున్నారు. ఈలోపు అఖిల్ నిశ్చితార్ధం చెయ్యడానికి నాగార్జున రెడీ అయిపోయాడు. అన్న పెళ్లి జరగకుండా తమ్ముడి పెళ్లి జరిపించేస్తున్నారేమిటా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే నాగ చైతన్య, సమంతల జాతకాల్లో ఏదో దోషం ఉండడం వలన వారి పెళ్లి వాయిదా పడిందనే పుకార్లు బయలుదేరాయి. మరి నాగార్జున కూడా రీజన్ చెప్పకుండా నాగ చైతన్య పెళ్లి వచ్చే ఏడాది జరిపిస్తామని... ఈలోపు అఖిల్ పెళ్లి చేసేస్తామని చెబుతున్నాడు. అందుకే ఎవరికీ తోచినట్టు వారు ఊహించేసుకుంటున్నారు.
ఇక సమంత టాలీవుడ్ లో ఏ చిత్రాలు ఒప్పుకోకుండా కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అయితే సమంత, నాగ చైతన్యల ప్రేమ విషయం బయటికి తెలిసాక వీరిద్దరూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక చిత్రం లో నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే సమంత ఉన్నట్టుండి కళ్యాణ్ కృష్ణ - నాగ చైతన్య ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇక సమంత ప్లేస్ లోకి రకుల్ వచ్చి చేరింది. అయితే సమంత - నాగ చైతన్య కలిసి సినిమా చేయకపోవడానికి కారణం మాత్రం నాగార్జున అని అంటున్నారు. నాగార్జున సమంతని పిలిచి పెళ్ళికి ముందు మీరిద్దరూ ఒకే చిత్రం లో గనక జోడిగా నటిస్తే చిన్న విషయాల్లో ఏమన్నా మనస్పర్థలు వస్తాయని... అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి సమంతని తప్పుకోమన్నాడనే వార్త ఎప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి కాబోయే మామగారు పిలిచి అలా చెబితే సమంత వినకుండా ఉంటుందా... . మామగారు చెప్పినట్టు పెళ్ళికి ముందే ఏదైనా మనస్పర్థలు వస్తే కష్టమని భావించి ఈ ప్రాజెక్ట్ నుండి సమంత సున్నితంగా తప్పుకుందట. అది అసలు విషయం.