వచ్చే సంక్రాంతి పోరులో బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి', చిరంజీవి నటిస్తున్న150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'లు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు చిత్రాలలో పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో బాలయ్య దూసుకుపోతున్నాడు. కానీ చిరు చిత్రంపై మాత్రం ఇంకా చాలా విషయాలల్లో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలలో బాలయ్య టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ చిరు చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ మాత్రమే విడుదలైంది. దీనిలో చిరు మొహాన్ని కూడా సరిగా చూపించకపోవడంతో దీన్ని చూసిన వారు పెదవి విరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్‌చరణే నిర్మాత కావడం, ఆయన హీరోగా నటిస్తున్న 'ధృవ' చిత్రం డిసెంబర్ 9న విడుదల కానుండటంతో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్, ప్రమోషన్ వంటి విషయాల్లో చరణ్ బిజీగా ఉన్నాడు. దీంతో ఈ చిత్రం విడుదలయ్యే వరకు చిరు చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకగానీ, ఇతర ప్రమోషన్ పనులు కానీ మొదలయ్యేట్లు కనిపించడం లేదు. మరోపక్క ఇప్పటికే బాలయ్య 'గౌతమీపుత్రశాతకర్ణి' ప్రకటనలు టీవీ చానెల్స్‌లో భారీ లెవల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇక బాలయ్య చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం ఆడియో వేడుక తేదీ, ట్రైలర్ రిలీజ్ తేదీ, వేదిక జరగనున్న ప్రదేశం, ఆ వేడుకకు వచ్చే అతిథుల విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 16న ఈ ఆడియో వేడుకను తిరుపతిలో జరపనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే వేడుకలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ రోజు నుండే ప్రమోషన్స్‌ను మరింత భారీస్థాయిలో జరపడానికి దర్శకనిర్మాత క్రిష్ సన్నద్దమవుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ కటింగ్ కూడా పూర్తి అయిందని సమాచారం. కానీ చిరు చిత్రం ఆడియో తేదీ, వేడుక, పవన్ హాజరవుతున్నాడా? లేదా? ఇతర అతిథులెవ్వరు అనే విషయంలో పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయే గానీ దేనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి బాలయ్య చిత్రం చిరు చిత్రం కంటే ముందుగానే యుద్దానికి సన్నద్ధం కావడం ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్, మెగాభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.