Advertisementt

అనుష్కకు త్వరలోనే పెళ్ళంట..?

Wed 30th Nov 2016 05:40 PM
star actress anushka,tollywood actress anushka shetty,bahubabali2 devasena  అనుష్కకు త్వరలోనే పెళ్ళంట..?
అనుష్కకు త్వరలోనే పెళ్ళంట..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క క్రేజ్ గురించి తెలియని సినీ అభిమాని ఉండడు. అనుష్క ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరో వైపు సోలో హీరోయిన్ గా కూడా తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అలా అనుష్క హాట్ హీరోయిన్ గా కూడా ఇమేజ్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసిన సందర్భాలు చవి చూశాం. ముఖ్యంగా అనుష్క.. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అనుష్క.. రాజమౌళి దర్శకుడుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర నటిస్తున్న విషయం తెలిసిందే.

అనుష్క బాహుబలి 2 లోనే కాకుండా బాగమతిసింగం 3, ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాల్లో కూడా నటించేందుకు సమాయత్తం అవుతుంది. అయితే ఉన్నట్టుండి అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా అనుష్క కుటుంబ సభ్యులు చాలా కాలం నుండి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అనుష్కకు తగిన వరుడి కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారి కుటుంబ సభ్యులకు పెళ్ళికొడుకు దొరికినట్లుగానే సమాచారం అందుతుంది. అయితే అనుష్కకు కాబోయే వరుడు కూడా బెంగుళూరుకు చెందిన వారుగానే ఊహాగానాలు అందుతున్నాయి. అనుష్క కుటుంబం కూడా బెంగుళూరులోనే ఉంటుంది కాబట్టి, కాబోయే వరుడు ఫ్యామిలీ కూడా బెంగుళూరే కావడంతో, అనుష్క కుటుంబ సభ్యులు కూడా ఓకే చేశారని టాక్ నడుస్తుంది. కానీ ఇప్పటివరకు అనుష్క కుటుంబ సభ్యలకు మాత్రం సంబంధం నచ్చేసిందని, అనుష్క నుండి ఇంకా కన్ఫర్ మేషన్ రావాలని తెలుస్తుంది. కాగా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వివాహం బెంగుళూరులోనే, వచ్చే వేసవిలో జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సంబంధం అనుష్క కుటుంబ సభ్యులకు బాగా దగ్గర సంబంధంగానే తెలుస్తుంది. వరుడికి ఇంకా టాలీవుడ్ తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇంతకీ అనుష్కకు కాబోయే వరుడు ఎవరో తెలియాల్సి ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ