Advertisementt

తెదేపాలో అలీకి కీలక రోల్..!

Wed 30th Nov 2016 05:53 PM
telugu comedian ali,actor ali,ali enter into politics,ali relation with tdp   తెదేపాలో అలీకి కీలక రోల్..!
తెదేపాలో అలీకి కీలక రోల్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో క‌మెడియ‌న్ అలీకి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బుల్లితెరపై షోలు, అప్పుడప్పుడూ సినిమా కార్యక్రమాలతో బాగా బిజీగా ఉండే అలీకి తెదేపాతో మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అలీ కూడా ఈ మధ్య తెదేపాలో కీలకంగా మారేందుకు పావులు కదుపుతున్నాడు. అంతే స్థాయిలో ఉత్సాహం కనబరుస్తున్నాడు. ఇంతకాలం బుల్లితెర షోల‌తో విసిగిపోయిన అలీ ఇక నుండి రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని చూస్తున్నట్లు అంతటా టాక్ నడుస్తుంది.

అలీకి తెదేపాతో ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ఆయనకు అసెంబ్లీ సీటు ఖాయ‌మైన‌ట్లగానే తెలుస్తుంది. తెదేపా అధిష్టానం కూడా అలీని ఏపీలో ముస్లిం ఓట‌ర్లను ఆకర్షించేందుకు పావుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లుగానే తెలుస్తుంది. అలీ కూడా ఆ దిశగా తెదేపా అధినాయకుడి నుండి వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్టుగానే జరుగుతున్న పరిణామాలను బట్టి క‌నిపిస్తుంది. ఈ దిశగా అలీ ఇప్ప‌టికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా అర్థమౌతుంది.  అందుకనే అలీ కూడా ఈ మధ్య ఆ దిశగా మాటలతో చెలరేగిపోతున్నాడు. ఈ విషయంపై అలీకి తెదేపా నుండి పూర్తి క్లారిటీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలీని లక్ష్యంగా చేసుకొని రాబోవు ఎన్నిక‌ల్లో ఏపీలోని ముస్లిం ఓట్ల‌న్నీ తమకే వచ్చేలా తెదేపా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా సమాచారం. అందుకనే అలీ ఈ విషయంపై స్పందిస్తూ... ఏపార్టీ అయితే ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇచ్చి తమను ఎక్కువగా ఆదరిస్తుందో ఆ పార్టీకే తాము మద్దతు పలుకుతాం అన్నట్లు వెల్లడించాడు. అలా తెదేపా అధిష్టానం నుండి అలీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగానే తెలుస్తుంది.

ప్రధానంగా రాయ‌ల‌సీమ‌లో ముస్లిం ఓట్ల‌న్నీ గ‌త ఎన్నిక‌ల్లో వైకాపా ఖాతాలోకి జమ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ముస్లిం ఓట్లన్నింటినీ తెదేపావైపుకి దారి మ‌ళ్లించేందుకు చంద్రబాబు, అలీకి సూచించిన‌ట్టుగా వెల్లడౌతున్న అంశం. ఏది ఏమైనప్పటికీ రాయలసీమ‌ ముస్లిం ఓట్లన్నీ తెదేపావైపు తిప్పుకునేందుకు బాబు పన్నిన పన్నాగంలో భాగమే అలీ మనసులోని మాటగా వెల్లడౌతున్న సమాచారం. అందుకనే అలీ ఇప్ప‌టినుంచే ముస్లింల ఇలాకాలో తెదేపా తరఫున ప్ర‌చారానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ