Advertisementt

పివిపికి షాకిచ్చిన నాగ్‌..!

Thu 01st Dec 2016 04:49 PM
p v p,akkineni nagarjuna,director omkar,nagarjuna enumeration 40 crors  పివిపికి షాకిచ్చిన నాగ్‌..!
పివిపికి షాకిచ్చిన నాగ్‌..!
Advertisement
Ads by CJ

తాజాగా నాగార్జున పివిపి బేనర్‌లో ఓంకార్‌ దర్శకత్వంలో 'రాజుగారి గది2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం కూడా ఇటీవలే జరిగింది. ఈ చిత్రంలో ప్రజలను శాసించే ఓ వైవిధ్యమైన క్యారెక్టర్‌ను నాగ్‌ పోషిస్తున్నాడు. 'ఊపిరి' చిత్రం సమయంలోనే పివిపి బేనర్‌లో మరో చిత్రం చేయడానికి ఒప్పుకున్న నాగ్‌ అన్నమాట ప్రకారం ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే ఇక్కడే ఆయన నిర్మాత పివిపికి ఓ షాక్‌ ఇచ్చాడని తెలుస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని కేవలం నాలుగుకోట్ల బడ్జెట్‌తో తీయాలని పివిపి భావించాడు. దాంతో నాగ్‌ను ఈ చిత్రం కోసం రెమ్యూనరేషన్‌ను తగ్గించి తీసుకునేలా చేయాలని భావించిన నిర్మాతకు నాగ్‌ అలా వీలుకాదని చెప్పి, ఈ చిత్రం కోసం 40రోజల డేట్స్‌ను ఇచ్చి, అందుకుగాను 5కోట్ల రెమ్యూనరేషన్‌ని డిమాండ్‌ చేయడంతో నిర్మాత నోట్లో పచ్చి వెలక్కాయ అడ్డుపడింది. కానీ నాగ్‌ వంటి ఇమేజ్‌ ఉన్న స్టార్‌ చిత్రం కావడంతో బిజినెస్‌పరంగా, శాటిలైట్‌ పరంగా బాగానే వర్కౌట్‌ అవుతుందని భావించిన నిర్మాత చివరకు నాగ్‌కు అంత మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డాడంటున్నారు. కేవలం నాగ్‌కే ఐదు కోట్లు ఇచ్చినప్పుడు ఇక ఈ చిత్రానికి ముందు అనుకున్న నాలుగుకోట్ల బడ్జెట్‌ రెండు మూడింతలు పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌ సమాచారం. మొత్తానికి నాగ్‌ తన డిమాండ్‌కు తగ్గ పారితోషికాన్ని పట్టుబట్టి సాధించాడట. పక్కా బిజినెస్‌ మైండ్‌ కలిగిన నాగ్‌ మరోసారి డబ్బుల విషయంలో మాత్రం మొహమాటాలకు వెళ్లేది లేదని నిరూపించుకున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ