సూపర్ స్టార్ మహేష్ పివిపి బ్యానర్ లో వంశి పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి వుంది. అసలు మహేష్ మా బ్యానర్ లో నటిస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్ తో పివిపి ఒక పోస్టర్ ని కూడా తయారు చేయించి మహేష్ - పివిపి - వంశీ పైడిపల్లి కాంబినేషన్ ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్ వదిలాడు. పివిపి అయితే ఈ సినిమా ఖచ్చితంగా వుంటుందనే భ్రమలో వున్నాడు. కానీ మహేష్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటికామెంట్ చెయ్య లేదు. ఇక మహేష్ సైలెంట్ అయ్యేసరికి అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా... లేదా...అనే అనుమానం అందరికి మొదలైంది.
అసలు మహేష్ పివిపి బ్యానర్ లో రెండు సినిమాలు చెయ్యాల్సి వుంది. ఇక మొదట సినిమా పివిపి బ్యానర్ లో మహేష్ చేసిన బ్రహ్మ్మోత్సవం ఎంతటి ఘోరమైన ప్లాపో తెలిసిందే. ఇక పివిపి, మహేష్ కాంబినేషన్ అంటే చెత్త కాంబినేషన్ అని అందరూ ముద్ర వేశారు. ఇక మహేష్ కూడా పివిపి బ్యానర్ లో మరోసారి చెయ్యడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అందుకే పివిపి వేయించిన పోస్టర్ కి మహేష్ రెస్పాండ్ అవ్వలేదని అంటున్నారు. ఇక వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో సినిమా గురించి ఎక్కడా నోరు మెదపలేదు.
ఇక మహేష్ మాత్రం పివిపిని చిత్ర నిర్మాణ బాధ్యత నుండి తప్పించి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే సినిమాకి నిర్మాతగా దిల్ రాజుని తీసుకోవాలనుకుంటున్నాడట. అంటే మహేష్ కి వంశీ పైడిపల్లి తో సినిమా చెయ్యాలని వున్నా అది కాస్తా పివిపి వల్ల ఇష్టం లేకుండా పోయిందనేగా దీనర్ధం. అందుకే పివిపిని తప్పించి దిల్ రాజుకి ఛాన్స్ ఇవ్వాలని మహేష్ అనుకుంటున్నాడని అంటున్నారు. అయితే మహేష్ కి పివిపి తో ఏం విభేదాలు లేవని పెద్ద నోట్ల రద్దు వలనే అడ్జెస్టుమెంట్ కోసం వంశీ పైడిపల్లి - మహేష్ సినిమాకి నిర్మాత మారాడని బిల్డప్ ఇస్తున్నారు. అయితే వంశీ పైడిపల్లి మహేష్ కాంబినేషన్ చిత్రం మహేష్ 25 వ చిత్రంగా వుంటుందా? లేదా? అనేది తెలియాల్సి వుంది.