సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ తాజాగా 'గురు' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొన్న సంగతి తెలిసిందే. 'సాలాఖద్దూస్'కు రీమేక్‌గా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ మధ్యవయస్కుడైన బాక్సింగ్ కోచ్‌గా నటిస్తుండగా, రితికాసింగ్ ఆయనకు బాక్సింగ్ శిష్యురాలిగా కనిపించనుంది. ఇక ఇప్పటికే వెంకీ గడ్డం పెంచుకుని ఉన్న వెంకీ ఫస్ట్‌లుక్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 13న 'గురు' చిత్రం ఫస్ట్‌టీజర్ విడుదలకానుంది. ఈ చిత్రం జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు వెంకీ 'నేను....శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్న తాజా చిత్రం 'ఆడవాళ్లు... మీకు జోహార్లు' చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్ 10న జరుగనుంది. ఈ చిత్రంలో కూడా వెంకీ మిడిల్ ఏజ్‌డ్ పర్సన్‌గా కనిపించనున్నాడు. ఓ మిడిల్ ఏజ్ వయస్కుడికి, ఓ టీనేజ్ అమ్మాయికి మధ్య జరిగే విభిన్న ప్రేమకథా చిత్రంగా ఇది రూపొందనుంది. మనసులు కలిస్తే... ప్రేమకు వయసు అడ్డంకి కాదు అనేది ఈ చిత్రం కాన్సెప్ట్‌గా చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ పాత్రతో పాటు ఆమె చెల్లెలి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ పాత్రకు కొంతకాలం కిందటివరకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, వర్మ పుణ్యమా అని 'ఐస్‌క్రీం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిపోయిన తేజస్వి నటించనుందని తెలుస్తోంది.