మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రేక్షకుల ముందుకురావడానికి ఇంకా యాభై రోజుల టైముంది. 'ఖైదీ నెంబర్ 150'గా మెరవనున్న ఈ సినిమా హడావుడి మాత్రం కనిపించడం లేదని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అప్పోజిషన్ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రచారంలో ముందుంది. దాంతో పోలిస్తే చిరు సినిమా మాత్రం వెనుకబడింది. అయితే అంచనాలు లేకుండా, సైలెంట్ గా విడుదల చేయడానికే చిరు కోటరి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంచనాలు పెంచితే అభిమానులు ఎక్కువ ఊహించుకుంటారు. దానికి సరిపడే ముడిసరుకు సినిమాలో లేకుండా ప్రమాదం. అందుకే సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ విజయం దక్కించుకోవాలనే ఆలోచన ఉందని అంటున్నారు.
మరోవైపు వారసుడు రామ్ చరణ్ 'ధృవ' సినిమా ఈనెల 9న వస్తోంది. ఆ తర్వాత 'ఖైదీ..' సినిమా పాటలు, టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ధృవకు 'ఖైదీ'కి సంబంధం ఏమిటో చిరు వర్గానికే తెలియాలి. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత రీ ఎంట్రీ కావడంతో 'పదో తరగతి పరీక్షరాసిన విద్యార్థి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు' చిరు వర్గం 'ఖైదీ' కోసం చూస్తోంది.