రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి సైలెంట్ గా అడుగుపెట్టి ఇప్పుడు యమా బిజీ తారగా మారిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడి కడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. రకుల్ ప్రీత్ ఇంత బిజీగా మారిపోతుంటే మిగిలిన హీరోయిన్స్ అందరూ తెల్లమొహాలేసుకుని ఆమెను చూస్తున్నారు. అయితే తాజాగా రకుల్ మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ కి జోడిగా మొదటిసారి ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా రామ్ చరణ్ సరసన ధృవ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 9 న విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజతో కూడా విన్నర్ చిత్రంలో నటిస్తుంది.
అలాగే రకుల్ నాగ చైతన్య - కళ్యణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ, బెల్లంకొండ శ్రీనివాస్- బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. వరుస ఆఫర్స్ తో ఒక్కసారిగా బిజీతారగా మారిపోయింది. మహేష్ 23 వ చిత్రం షూటింగ్ అహ్మదాబాద్ లో జరుపుకుంటుంది. ఇక అక్కడ మహేష్ తో 5 రోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రకుల్... అక్కడినుండి వైజాగ్ లో జరుగుతున్న నాగ చైతన్య చిత్ర షూటింగ్ లో వాలిపోయింది. అక్కడ నాగ చైతన్యతో కొన్ని సీన్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మహేష్ చిత్ర షూటింగ్ కి హాజరై అది పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేసింది.
మరి ఇన్ని సినిమాల డేట్స్ ని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ అందరి హీరోలకు సహకరిస్తుంది. అలాగే హైదరాబాద్ చేరుకున్న రకుల్ నిన్న రాత్రి తన స్నేహితురాలైన రాశి ఖన్నా బర్త్ డే పార్టీలో పాల్గొని హడావిడి చేసింది. మరి రకుల్ ని చూస్తుంటే దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని పక్కాగా ఫాలో అవుతుందని అనిపిస్తుంది కదా.