Advertisementt

అమెరికా అమ్మాయి దశ తిరుగుతుందా..?

Sat 03rd Dec 2016 02:06 PM
oxygen movie,anu emmanuel,gopi chand,director trivikram,producer radha krishna,kittu unnadu jagratha movie  అమెరికా అమ్మాయి దశ తిరుగుతుందా..?
అమెరికా అమ్మాయి దశ తిరుగుతుందా..?
Advertisement
Ads by CJ

అమెరికాలో పెరిగిన కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. తాజాగా ఆమె నాని సరసన 'మజ్ను' చిత్రంలో అమాయకమైన పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె ప్రస్తుతం హీరో గోపీచంద్‌ నటిస్తున్న 'ఆక్సిజన్‌' చిత్రంతో పాటు రాజ్‌తరుణ్‌ సరసన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడుకు తాజాగా బంపర్‌ ఆఫర్‌ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో పవన్‌కళ్యాణ్‌ నటించనున్న చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆమె ఎంపికైందంటున్నారు. తాజా సంచలనం కీర్తిసురేష్‌ మెయిన్‌హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట సెకండ్‌హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించనుందని ప్రచారం జరిగింది. కానీ త్రివిక్రమ్‌తో పాటు పవన్‌ కూడా అను ఇమ్మాన్యుయేల్‌ వైపే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఆల్‌రెడీ ప్రారంభోత్సవం కూడా జరుపుకొని, జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరోయిన్లను అందంగా చూపించడంలో త్రివిక్రమ్‌ది ప్రత్యేక శైలి. ఇక అందునా పవన్‌ పక్కన అంటే ఇక చెప్పేదేముంది. పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఆయన రెండో హీరోయిన్‌గా నటించిన ప్రణీతను ఎంతో అందంగా చూపించాడు. కానీ ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రణీత మాత్రం ఆ తర్వాత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని వచ్చిన క్రేజ్‌ను పోగొట్టుకుంది. మరి అను ఇమ్మాన్యుయేల్‌ వార్తే నిజమైతే ఆమె ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ