Advertisementt

వంగవీటి కోసం వర్మ తగ్గాడు..!

Sat 03rd Dec 2016 02:28 PM
varma,kamma kaapu song,vangaveeti movie,rgv  వంగవీటి కోసం వర్మ తగ్గాడు..!
వంగవీటి కోసం వర్మ తగ్గాడు..!
Advertisement
Ads by CJ

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి అనుకుంటే అది చేసుకుంటూ పోతుంటాడు. ఆ విషయంలో ఎవరేం అనుకున్నా ఏమాత్రం పట్టించుకోడు. కానీ ఒక్క విషయంలో మాత్రం వెనక్కి తగ్గినట్లుగానే తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తాజాగా విజయవాడలోని  రౌడీయిజం, రాజకీయాలు ప్రధాన భూమికగా తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి. వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా చేసుకొని వర్మ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయనడానికి వర్మ విడుదల చేసిన కాపు, కమ్మ కులాలకు సంబంధించిన పాట వింటేనే అర్థమౌతుంది. 

అయితే వర్మ విజయవాడ కేంద్రంగా వాస్తవంగా జరిగిన చరిత్రను వక్రీకరించాడంటూ కొంత మంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అయితే ముఖ్యంగా విజయవాడలో కుల విద్వేషాలను రెచ్చగొట్టేలా వంగవీటి చిత్రంలో ఉన్న కమ్మ, కాపుకు సంబంధించిన పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసు తాలూకూ విచారణ చేపట్టిన హైకోర్టు, రామ్ గోపాల్ వర్మకు, ఈ సినిమా నిర్మాత అయిన దాసరి కిరణ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది. అంతటితో ఊరుకోకుండా.. కోర్టు తీర్పును వెల్లడించేంత వరకు కూడా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదని కూడా  కోర్టు సెన్సార్ బోర్డ్ ను ఆదేశించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 23వ తేదీన వంగవీటి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. కానీ హైకోర్టు తీర్పుతో ఖంగుతిన్న చిత్ర యూనిట్ వివాదాన్ని పెంచుకోవడం పద్ధతి కాదని భావించి  కాస్త వెనక్కి తగ్గి ఆ పాటను సినిమాలో నుండి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే వివాదానికి కారణమైన పాటను తొలగించడంతో వర్మ వంగవీటి చిత్రం డిసెంబర్ 23వ తేదీన విడుదలకు సంబంధించి ఆటంకాలు తొలగిపోయినట్లుగానే తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ