తమిళనాట రజనీకాంత్ తర్వాత మాస్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా అజిత్‌కు మంచి పేరుంది. ఆయన కోసం ప్రాణాలర్పించేంతటి వీరాభిమానులు తమిళనాడులో ఉన్నారు. ఈ విషయంలో ఆయనకు, విజయ్‌కు మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. కాగా అజిత్ ప్రస్తుతం తనకు వరుసహిట్లను ఇస్తున్న దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. గోపీచంద్, రవితేజ వంటి తెలుగు హీరోలతో కూడా పనిచేసిన దర్శకుడు శివ మనకు కూడా బాగా పరిచయమే. 'వీరం, వేదాళం' వంటి సూపర్‌హిట్స్ తర్వాత అజిత్-శివల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో పాటు ఈ చిత్రంలో స్టోరీ ప్రకారం అజిత్ వివిధ దేశాలు తిరిగే అండర్‌వరల్డ్‌కాప్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాటు నిర్మాతలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఈ చిత్రం కోసం విపరీతమైన బడ్జెట్‌ను నిర్మాతలు కేటాయిస్తున్నారు. ఏకంగా 12 దేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అయినా సరే రాజీపడకుండా దర్శక, హీరోల కోరికపై నిర్మాతలు అజిత్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. అజిత్ నటిస్తోన్న 57వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఆయన సరసన కాజల్, అక్షరహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలా వరల్డ్ టూర్ తిరుగుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు ఏకంగా 75కోట్ల బడ్జెట్‌ను ఖర్చుచేస్తున్నారన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.