కింగ్ నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్‌కు, ఆయన ప్రేయసి, ప్రముఖ వ్యాపారవేత్త సోమనాధ్ భూపాల్, శాలినీ దంపతుల కుమార్తె శ్రేయాభూపాల్‌కు నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లోని జివికె నివాసంలో సాయంత్రం 7గంటలకు జరగనుంది. కాగా వీరి వివాహం వచ్చే ఏడాది మేనెలలో ఇటలీ వంటి దూరదేశంలో జరగనున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం లేనందున నిశ్చితార్ధానికైనా అందరినీ పిలిచి గ్రాండ్‌గా చేస్తారని భావించారు. కానీ నాగ్ మాత్రం ఈ వేడుకను కేవలం తమ రెండు కుటుంబాలకు చెందిన ఫంక్షన్‌గా, కేవలం తనకు సన్నిహితులు, ముఖ్యులైన వారినే అతిథులుగా పిలవాలని, 50 మందిని గెస్ట్‌లు మాత్రమే వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ కార్యక్రమానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీకి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారని టాలీవుడ్ టాక్.ఇక పెళ్లి జరిగే ఇటలీకి కూడా పెద్దగా ఎవ్వరు రారు.. కాబట్టి ఆ తర్వాత రిసెప్షన్ మాత్రం అందరినీ పిలిచి గ్రాండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం మోదీ పెద్దనోట్ల రద్దు వ్యవహారం తర్వాత పారిశ్రామిక వేత్తలు, బడా బాబులు, భారీగా కూడబెట్టిన రాజకీయ నాయకులపైనే కాక సినీరంగ ప్రముఖులపై కూడా అందరి దృష్టి ఉంది. బ్యాంకుల్లో విత్‌డ్రాకు కూడా
పరిమితులు విధించారు. జనాలు కరెన్సీ అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల కుటుంబాలల్లో పెళివేడుకలు కూడా రద్దవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి, ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేస్తే నాగ్ పెట్టిన ఖర్చు, చేసిన ఆడంబరాలు వంటివి విమర్శల పాలు కావడమే కాదు.. ఐటీ శాఖ దృష్టి కూడా తనపై పడుతుందని భయపడిన నాగ్ చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.