జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల తండ్రి హరికృష్ణ ఈమధ్య కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. నటునిగా కూడా ఆయన ఎన్నో పాత్రలలో చేసి మెప్పించారు. మరీ ముఖ్యంగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఆయన చేసిన చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. ఇక 'సీతయ్య' చిత్రంలో ఆయన నటన పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పాటు పలువురు హీరోల చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు మరింత పెద్ద అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇప్పటికైనా ఆయనకు సరైన క్యారెక్టర్ పడితే ఇరగదీస్తాడనేది నందమూరి అభిమానుల నిశ్చితాభిప్రాయం. కాగా అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం' తర్వాత మన వారసులతో నిండిన పరిశ్రమలోని ప్రతి ఫ్యామిలీ ఇలాంటి చిత్రాలను చేయాలని ఆశపడుతున్నారు. ఇక నిర్మాతగా కళ్యాణ్‌రామ్ గట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు కూడా మరలా అవకాశాలు ఇస్తాడనే పేరుంది. ఇక ఆయన మదిలో ఎప్పటి నుంచో 'మనం'లాంటి చిత్రం చేయలనే ఆశ ఉంది. దానిపై గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇక తనకు 'పటాస్' వంటి ఎవర్‌గ్రీన్ హిట్‌ను ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో నందమూరి కళ్యాణ్‌రామ్ తమ ఫ్యామిలీ చిత్రాన్ని నిర్మించనున్నాడనేది తాజా సమాచారం. 'పటాస్'తోపాటు 'సుప్రీం' వంటి వరుస రెండు కమర్షియల్ హిట్స్‌ను అందించిన అనిల్ అంటే కళ్యాణ్‌రామ్‌కు మంచి నమ్మకం ఉంది. దీంతో ఇలాంటి చిత్రానికి ఓ కథ తయారుచేసే బాధ్యతలను అనిల్ రావిపూడి ఇచ్చాడట. ఇందులో హరికృష్ణ క్యారెక్టర్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండేలా డిజైన్ చేయడానికి అనిల్ అహర్నిశలు కష్ట పడుతున్నాడంటున్నారు. అలాగే ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరో కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఓ అతిథి పాత్ర చేయనున్నాడని సమాచారం. మరి ఈ వార్తే నిజమైతే అది జూనియర్ ఫ్యామిలీ అబిమానులకు తీపి వార్తే అవుతుంది.