రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతారలు ముఖ్యపాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగుభాషల్లో ఎంతటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 1993లో మోహన్‌లాల్, సురేష్‌గోపి, శోభన నటించిన మలయాళ చిత్రం 'మణిచిత్ర తాలు'కు రీమేక్. ఈ చిత్రం ఇప్పటివరకు మలయాళంలో వచ్చిన టాప్‌టెన్ చిత్రాలలో ఒకటి.ఈ చిత్రానికి ఫాజిల్ దర్శకుడు. కాగా ఈచిత్రం విడుదలైన 23ఏళ్లకు ఈ చిత్రం ఓరిజినల్ మలయాళ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ అయి, ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై ఉన్న అభిమానంలో ఓ నెటిజన్ ఈ చిత్రం ట్రైలర్‌ను కట్ చేసి, ఎడిట్ చేసి విడుదల చేశాడు. కాగా ఈ చిత్రం మలయాళలో వచ్చిన ఎంతో కాలానికి దర్శకుడు పి.వాసు సలహాతో కన్నడస్టార్ విష్ణువర్దన్ కన్నడలోకి రీమేక్ చేశాడు. 'ఆప్తమిత్ర' పేరుతో 2004లో విష్ణువర్దన్, సౌందర్యలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం కన్నడలో కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత దీనిని రజనీకాంత్ అదే దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో నిర్మించాడు. కాగా ఈ చిత్రం మలయాళ వెర్షన్ చూసిన దర్శకుడు, 'మనస్సంతానువ్వే, నేనున్నాను' వంటి హిట్స్ ఇచ్చి, అంతకుముందే చిరు నటించిన 'బావగారూ..బాగున్నారా' చిత్రానికి డైరెక్షన్ డిప్టార్ట్‌మెంట్‌లో పనిచేసి, ఆ టైటిల్‌ను చిరుకు సూచించి చిరు మెప్పును పొందిన వి.యన్.ఆదిత్యకు ఆయన దర్శకునిగా ఓ చిత్రం చేస్తానని ఆ చిత్రం ఫంక్షన్‌లో ప్రామిస్ చేశాడు.దీంతో ఈ చిత్రం మలయాళ వెర్షన్ చూసి ముగ్దుడైన వి.యన్.ఆదిత్య ఈ చిత్రం డివిడిని చిరుకి చూపించి, మీరు సైకియాట్రిస్ట్‌గా నటిస్తే సూపర్‌గా ఉంటుందని చెప్పాడట. కానీ చిరు మాత్రం ఆ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒంటపట్టదని చెప్పి, ఆదిత్య మాటను తిరస్కరించాడట. కానీ 'చంద్రముఖి' చిత్రం రిలీజై సంచలన విజయం నమోదు చేసిన తర్వాత ఆయన ఆదిత్యను పిలిచి, నీ జడ్జిమెంటే నిజమైందని అభినందించాడట. అది సంగతి.