Advertisementt

తేలిపోనున్న ఈ డైరెక్టర్ భవితవ్యం..!

Thu 08th Dec 2016 06:51 PM
ram charan,dhruva movie,tomorrow release dhruva movie,director surender reddy,chiranjeevi,khaidi no 150,vvvinayak  తేలిపోనున్న ఈ డైరెక్టర్ భవితవ్యం..!
తేలిపోనున్న ఈ డైరెక్టర్ భవితవ్యం..!
Advertisement
Ads by CJ

ఓ పెద్ద స్టార్‌తో భారీ చిత్రం చేస్తుంటే ఆ చిత్ర దర్శకుడు మంచి హిట్‌ కొడితే అతడిని తమ చిత్రాలకు డైరెక్టర్‌ బాధ్యతలను అప్పగించాలని పలువురు కర్చీఫ్‌లు వేస్తుంటారు. కానీ ఆ చిత్రం హిట్‌ కాకపోతే మాత్రం ముందుగా చేస్తామని చెప్పిన హీరోలు, నిర్మాతలు మొహం కూడా చూపించరు. ఇది సినీ పరిశ్రమలో సహజం. దీనికి ఎందరినో ఉదాహరణగా చూపించవచ్చు. 

కాగా రామ్‌చరణ్‌ 'ధృవ' చిత్రం షూటింగ్‌ సమయంలోనే ఆయన పనితనాన్ని చూసిన చిరు తాను కూడా ఆయనతో ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సురేందర్‌రడ్డి ఆల్‌రెడీ ప్రకటించాడు. కాగా ఇప్పుడు ఆయన తాజాగా అఖిల్‌ నటించే మూడో చిత్రానికి కూడా తానే దర్శకత్వం వహిస్తున్నానని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. 'ధృవ' హిట్‌ అయితే ఏ సమస్య లేదు కానీ ఆయన చిత్రం ఫ్లాప్‌ అయితే మాత్రం చిరు, అఖిల్‌ల చిత్రాల విషయంలో మాత్రం మార్పురావచ్చు. ఈ సంగతి మరో కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. అయితే చరణ్‌ 'కిక్‌2' వంటి డిజాస్టర్‌ తర్వాత కూడా సురేందర్‌రెడ్డిని నమ్మి ఈ చిత్రం ఇచ్చాడని, అలాగే చిరు కూడా 'అఖిల్‌'వంటి డిజాస్టర్‌ తర్వాత తన ప్రతిష్టాత్మక 150వ చిత్రమైన 'ఖైదీనెంబర్‌ 150'కు వినాయక్‌కు అవకాశం ఇచ్చారనే విషయాన్ని మెగాభిమానులు ఉదాహరణగా చెబుతున్నారు. ఇక వినాయక్‌, చిరులు తమ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విజయవాడలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ