ప్రస్తుతం దర్శకులందరూ మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో తమ చిత్రాల టైటిల్స్‌ను పెట్టడంలో ఎవ్వరికీ అర్దం కాని ఓ వింత ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. గతంలో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా,,, నాన్న.. ఓ తమిళ అమ్మాయి' వంటి పొయిటిక్ టైటిల్స్‌ను పెట్టి మెప్పించిన పూరీ జగన్నాథ్ ఆతర్వాత 'ఇడియట్, పోకిరి, లోఫర్' వంటి తిట్లను కూడా తన చిత్రాలకు టైటిల్స్‌గా పెట్టాడు. ఆ తర్వాత ఆయన మరింత దూరం వెళ్లి మాస్ ప్రేక్షకులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన ప్రేక్షకులకు 'టెంపర్, ఇజం' వంటి అర్దం కాని టైటిల్స్‌ను కూడా పెట్టాడు. తాజాగా ఆయన తన చిత్రాన్నికి 'మూడు కోతులు.. ఒక మేక' అనే మరో విచిత్రమెన టైటిల్‌ను పెట్టి, తన పంథా సపరేటని నిరూపిస్తున్నాడు. ఇక అచ్చమైన తెలుగు చిత్రాలను తీసే కల బలం ఉన్న రచయిత, దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన చిత్రాలలో ఎక్కువ వాటికి ప్రాచుర్యంలో ఉండి, అందరికీ నచ్చే, అర్థమయ్యే టైటిల్స్‌నుపెడూతూ వస్తున్నాడు. కానీ ఆయన కూడా తన కొన్ని చిత్రాలకు 'జల్సా, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి' వంటి టైటిల్స్‌నుపెట్టినా అవి అందరికీ అర్దమయ్యే పదాలే కావడం గమనార్హం. ఇక ఇటీవల తన చిత్రానికి 'అ..ఆ' వంటి అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయిన త్రివిక్రమ్ కొత్తగా తాను నిర్మిస్తున్న చిత్రానికి మాత్రం ఎవ్వరికీ అర్ధం కాని ఓ ఇంగ్లీషు టైటిల్‌ను పెట్టి, దాని క్యాప్షన్ ద్వారా అందరికీ విడమరిచి చేప్పే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ అందిస్తున్న మూలకథతో కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పవన్‌కళ్యాణ్, నితిన్‌లతో పాటు త్రివిక్రమ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం తాజాగా త్రివిక్రమ్ 'లై' అనే టైటిల్‌ను పెట్టి దానికి క్యాప్షన్‌గా (లవ్ ఈజ్ ఎండ్‌లెస్)ను డిసైడ్ చేశాడని, ఈ టైటిల్‌ను ఆల్‌రెడీ రిజిష్టర్ కూడా చేశారని సమాచారం. మరి 'లై' అంటే అబద్దమని చాలామందికి అర్దం కాదు. మరి ఈ చిత్రానికి అదే టైటిల్‌ను ఫైనల్ చేస్తారో? లేక ఏమైనా కొత్త టైటిల్‌ను వెతుకుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.