Advertisementt

రవితేజ ది ఎన్టీఆర్ కి, ఎన్టీఆర్ ది రవితేజ కి!

Fri 09th Dec 2016 01:27 PM
raviteja,jr ntr,anil ravipudi,bobby,stories exchange  రవితేజ ది ఎన్టీఆర్ కి, ఎన్టీఆర్ ది రవితేజ కి!
రవితేజ ది ఎన్టీఆర్ కి, ఎన్టీఆర్ ది రవితేజ కి!
Advertisement
Ads by CJ

రవితేజ ఈ మధ్యన ఏ చిత్రం ఒప్పుకోకుండా బాగా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఏవో చిత్రాలు ఒప్పుకున్నాడని వార్తలొచ్చినా అవేమి పట్టాలెక్కలేదు. అయితే రవితేజ మీద ఒక పెద్ద రూమర్ కూడా బయలుదేరింది. అదేమిటంటే రవితేజ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాడనే ప్రచారము జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యన రవితేజ పేరు మీడియాలో పెద్దగా వినపడడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా రవితేజ.. అనిల్ రావిపూడి కథకు ఒకే చేప్పి ఆ సినిమాని పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడని సమాచారం.  

ఇక రవితేజాలాగే మరో హీరో కూడా తన తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి నానా తంటాలు పడుతున్నాడు. అతనే జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టి చాలా రోజులైంది. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టకుండా నాన్చుతూనే వున్నాడు. అసలే డైరెక్టర్ తో చేస్తే మళ్ళీ హిట్ పడుతుందో తెలియక తెగ సతమతమవుతున్నాడు. అయితే చాలామంది డైరెక్టర్స్ దగ్గర కథను విన్న ఎన్టీఆర్ ప్లాప్ డైరెక్టర్ బాబీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యి తన నెక్స్ట్ ప్రాజెక్టుని మొదలు పెట్టేదిశగా అడుగులు వేస్తున్నాడని సమాచారం. 

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఈ ఇద్దరు హీరోలు మొదలబెట్టబోయే సినిమాలకు ఒక దగ్గర సంబంధం వుంది. అదేమిటంటే రవితేజ కి అనిల్ రావిపూడి చెప్పిన కథని ముందుగా ఎన్టీఆర్  కి చెప్పాడని ఆ కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చి ఓకె చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక మరోపక్క డైరెక్టర్ బాబీ.. ఎన్టీఆర్ కి చెప్పిన కథని ముందుగా రవితేజ కి చెప్పాడని రవితేజకి కూడా ఆ కథ నచ్చినదని... కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. ఇక అదే కథని ఇప్పుడు ఎన్టీఆర్ కి చెప్పగా ఎన్టీఆర్ ఆ కథనే ఒకే చేసి సినిమా మొదలుపెట్టమని బాబీకి చెప్పాడని సమాచారం. ఈ కథల సంబంధం చూస్తుంటే అక్కడ ఇక్కడ, ఇక్కడ అక్కడ వర్కౌట్ అయినట్లు లేదూ...! మరి ఈ సంబంధం ఆయా హీరోలకు ఎటువంటి హిట్లు ఇస్తాయో చూద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ