Advertisementt

టిటిడి సభ్యుడిపై ఐటి దాడి.. భారీగా నగదు..!

Fri 09th Dec 2016 09:12 PM
sekhar reddy,ttd member,jayalalitha,chandrababu,it attack  టిటిడి సభ్యుడిపై ఐటి దాడి.. భారీగా నగదు..!
టిటిడి సభ్యుడిపై ఐటి దాడి.. భారీగా నగదు..!
Advertisement
Ads by CJ

తమిళనాడు ఒకవైపు జయలలిత మరణించడంతో తీవ్ర దుఃఖంలో ఉండగా మరోవైపు  తెలుగు వ్యాపారవేత్తల నివాసాలు, ఆఫీసుల్లో ఐటి దాడులు జరిపి సంచలనానికి దారితీసింది. ప్రధానంగా ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలైన శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లపై ఏకధాటిగా 60 మంది ఐటీ అధికారులు దాడులు జరిపగా పెద్ద మొత్తంలో నగదు వెలుగు చూసింది. ఒక్కసారిగా 100 కేజీల బంగారం, 90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే టీటీడీలో సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో కీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా వీరంతా ఇసుక వ్యాపారాలు గట్రా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్టుగా కలిసే అనుమతులు కూడా వీరికి దండిగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఏపీకి సీయంగా చంద్రబాబు అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించాడు. అలాగే శేఖర్ రెడ్డి తమిళనాడు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా వీరందరినీ వేలూరు సమీపంలో పట్టుకొని ఐటి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.  అయితే వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు విలువ దాదాపు రూ.130 కోట్లుగా తెలుస్తుంది. బంగారమైతే కడ్డీల రూపంలో పెద్ద పెద్ద నిల్వలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ