బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరోయిన్లలో రేఖ ఒకరు. తన నటనతో, అందంతో ఆమె కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆమె తెరపై కనిపిస్తే చాలు.. సినిమా సూపర్‌హిట్టే అనేంత పేరును తెచ్చుకున్నారు. ఇక ఆమె ఆనాడు బాలీవుడ్‌ను ఏలిన బాద్‌షా అమితాబ్‌బచ్చన్‌తో నడిపిన ప్రేమాయణం గురించి సినీ ప్రియులందరికీ తెలుసు. నటిగానే కాదు.. ప్రేమ, పెళ్లి, ఎఫైర్లు, రూమర్లు, చీవాట్లు, చెప్పుదెబ్బలు వంటి చీకటి కోణాలు ఆమె జీవితంలో ఎన్నో ఉన్నాయి. కాగా ఆమె స్వతహాగా తెలుగమ్మాయి. ఆమె తల్లి పుష్పవల్లి నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కాగా రేఖ దక్షిణాదిలో బాలనటిగా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌కు వెళ్లి ఓ వెలుగు వెలిగింది. 1966లో ఆమె 'రంగులరాట్నం' చిత్రంలో బాలనటిగా తెలుగుతెరపై కనిపించింది. కానీ ఆమె పెద్దయిన తర్వాత ఒక్క తెలుగు చిత్రమైనా చేయాలని ఎంతగానో తపించింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఆమె కల నెరవేరబోతోంది. ఈ విషయంపై ఇప్పటికే కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఈ చిత్రాన్ని మరో నటి కన్‌ఫర్మ్ చేస్తూ మాట్లాడింది. 'జయమ్ము నిశ్చయమ్మురా' ఫేం పూర్ణ మాట్లాడుతూ, త్వరలో నేను రేఖ గారితో నటిస్తూ ఓ చిత్రం చేయనున్నాను. ఈ చిత్రం మూడు తరాలకు సంబంధించిన చిత్రం. ఇందులో పాతతరం సీన్స్‌ను నేచురాలిటీ కోసం బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించనున్నారంటూ కన్‌ఫర్మ్ చేసింది. కాగా ఈ చిత్రం రేఖ బయోపికా లేక ఓ థ్రిల్లర్ స్టోరీనా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఇంతకాలానికి రేఖ చిన్ననాటి కోరిక నెరవేరనుంది.