చెన్నై బ్యూటీ, సీనియర్ హీరోయిన్ త్రిష కెరీర్ ఇక అయిపోయిందని అందరూ భావించారు. దాంతో ఆమె కూడా పెళ్లి చేసుకొని, సెటిలై పోవాలని భావించింది. కానీ అనూహ్యంగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అప్రతిహతంగా సాగుతోంది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు ఇటీవల విడుదలైన స్టార్ ధనుష్ నటించిన 'ధర్మయోగి' చిత్రంలో ఆమె విలన్ ఛాయలుండే పొలిటీషియన్ పాత్రలో తమిళ ప్రజల మనసులను దోచుకుంది. దీంతో ఆమెకు ఇప్పుడు పలు స్టార్ హీరోల చిత్రాలలో ప్రధాన పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కాగా రజనీతో చేయాలనే ఆమె చిరకాల వాంఛ కూడా 'రంజిత్‌పా' చిత్రంతో నెరవేరనుంది. ఇందులో కూడా ఆమె రజనీకి ధీటైన పాత్రను పోషించనుంది. ఇక నిన్నటి తరం డ్రీమ్‌బోయ్, 'తని ఒరువన్'తో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి హీరోగా నటించే చిత్రంలో కూడా ఆ భామ నటించనుంది. తాజాగా ఆమెకు మలయాళంలో బంపర్‌ఆఫర్ వచ్చిందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత శ్యాంప్రసాద్ ముఖర్జీ దర్శకత్వంలో యువహీరో, 'ప్రేమమ్' ఫేమ్ నవీన్‌పౌల్ హీరోగా తెరకెక్కనున్న ఓ మలయాళ చిత్రంలో ఆమె అద్భుతమైన పాత్ర పోషించనుందని, మలయాళీలు మెచ్చేలా వాస్తవికతతో కూడిన ఈ చిత్రంలోని త్రిష పాత్ర కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుందని, ఇందులో త్రిష మేకప్ లేకుండా సాగే ఓ డీగ్లామరైజ్ పవర్‌ఫుల్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో త్రిషకు జాతీయ స్థాయిలో అవార్డులు ఖాయమంటున్నారు.