Advertisementt

ఎన్టీఆర్ సరసన ఈసారి ముగ్గురంట..!

Sun 11th Dec 2016 12:05 PM
tollywood,young tiger ntr,director babi,babi ntr combination movie,three hreoines,producer kalyan ram,ntr arts banner,two new heroines  ఎన్టీఆర్ సరసన ఈసారి ముగ్గురంట..!
ఎన్టీఆర్ సరసన ఈసారి ముగ్గురంట..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జ‌నతా గ్యారేజ్‌' చిత్రంలో ఇద్ద‌రు నాయికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలోని ఓ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ఈ చిత్రం నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనుంది. అయితే వీరి కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరోయిన్‌, ఇద్ద‌రు కొత్త‌మ్మాయిల‌ను ఎంపిక చేసే పనిలో చిత్రబృందం ఉంది. ఈ చిత్రం షూటింగ్ కూడా జనవరి నుండి మొదలు కానుంది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా అంతటా టాక్ నడుస్తుంది. నిజంగా దర్శకుడు బాబికి ఇది ఊహించ‌ని అవకాశమే గానీ ఆయన అది ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపైనే అంతా ఉంది.

ప‌వ‌ర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న బాబి ఆ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో చేసిన స‌ర్దార్-గ‌బ్బ‌ర్ సింగ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ర‌వితేజ‌తో సినిమా అనుకొన్నా.. అది తెగలేదు. కాగా ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ తో దర్శకుడు బాబికి పిలుపు రావడం, ర‌వితేజ‌కు చెప్పిన క‌థే, ఎన్టీఆర్‌కీ వినిపించడం, బాబి అక్కడ పాస్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కి బాబి వేరే కథ చెప్పడం ఓకే చేయడం అంతా జరిగిపోయింది. మొత్తానికి డజన్ల కొద్ది స్టార్ డైరెక్టర్లను పక్కనబెట్టిన ఎన్టీఆర్ ని బాబి ఏం చేస్తాడో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ