Advertisementt

లీక్ చేసినందుకు బాబీ పై ఎన్టీఆర్ కోపం..!

Sun 11th Dec 2016 01:07 PM
jr ntr,bobby,kona venkat,jr ntr fire on bobby,bobby and jr ntr movie main theme  లీక్ చేసినందుకు బాబీ పై ఎన్టీఆర్ కోపం..!
లీక్ చేసినందుకు బాబీ పై ఎన్టీఆర్ కోపం..!
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత జూనియర్ చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి ప్లాప్ ఇచ్చిన బాబీ కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి తన నెక్స్ట్ సినిమాని మొదలెట్టేసాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్, బాబీ కథని ఫైనల్ చెయ్యక ముందు చాలామంది డైరెక్టర్స్ కథలను విని వాటినేమి ఒప్పుకోకుండా చివరికి బాబీకి కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమాలను జరుపుకుని సెట్స్ మీదకి వెళ్ళింది. అయితే ఎన్టీఆర్ అసలు 'సర్దార్' వంటి ప్లాప్ ఇచ్చిన బాబీ కి ఎందుకు అవకాశం ఇచ్చాడా... అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదలుకుని సామాన్య ప్రేక్షకుడు వరకు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. 

కానీ ఎన్టీఆర్ మాత్రం బాబీ చెప్పిన కథకు ఫ్లాట్ అయిపోయి బాబీ ని ఒకే చేసాడట. ఆ కథలో ఉన్న ఒక కీలక పాయింట్ ఎన్టీఆర్ కి పిచ్చగా నచ్చేసిందట. ఈ స్టోరీ లో ఎన్టీఆర్ కి మూడు పాత్రలు ఉంటాయట. ఈ మూడు పాత్రలు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో వుండడంవలనే ఈ స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని వార్తలొస్తున్నాయి. అందుకే ఈ కథకు చిన్న చిన్న మార్పులు చేర్పులు చెయ్యమని చెప్పి ఈ కథని ఒకే చేసేసాడట. అయితే ఈ మూడు పాత్రలు అనే పాయింట్ ని బయటికి రాకుండా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ జాగ్రత్త పడ్డారట. కానీ ఈ విషయం ఎలా బయటికొచ్చిందో తెలియదు గాని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ తెగ ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ విషయం ఎలా బయటికొచ్చిందో అని ఎన్టీఆర్ ఆరా తీస్తున్నాడని సమాచారం. ఇక ఈ న్యూస్ ప్రొడక్షన్ యూనిట్ వైపు నుంచి కాకుండా,  బాబీ, కోన వెంకట్ వైపు నుంచి లీకయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయం పై బాబీ కి కోనకు ఎన్టీఆర్ క్లాస్ పీకాడని సమాచారం. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ విషయము లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోమని డైరెక్టర్ బాబీ కి ఎన్టీఆర్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ